అల్లకల్లోలంలో బొల్లా.. వినుకొండలో ఎమ్మెల్యేకు సొంత పార్టీ నుంచే షాకులు..!
ఎమ్మెల్యే బొల్లా పరిస్థితి అల్లకల్లోలంగా ఉందనే టాక్ .. వినుకొండ నియోజకవర్గంలో తారస్థాయికి చేరింది.
By: Tupaki Desk | 6 Aug 2023 11:30 PM GMTఎమ్మెల్యే బొల్లా పరిస్థితి అల్లకల్లోలంగా ఉందనే టాక్ .. వినుకొండ నియోజకవర్గంలో తారస్థాయికి చేరింది. సిట్టిం గ్ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడు పెళ్లికి-చావుకు తేడా లేకుండా పాల్గొంటున్నా.. ఆ తరహా సింపతీ మాత్రం ఆయనకు రావడం లేదు. సొంత పార్టీ నాయకులే ఆయనను అసహ్యించుకుంటు న్న పరిస్థితి అడుగడుగునా కనిపిస్తోంది. ఎందుకంటే.. నాలుగేళ్ల పాటు నియోజకవర్గాన్ని ఆయన గాలికి వదిలేశారని.. పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు.
ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల కళ్లకు గంతలు కట్టేలా.. అన్ని కార్యక్రమాలకు వచ్చేసి .. తనను గెలిపించాలంటూ.. ఆయన పడుతున్న పాట్లను సొంత పార్టీ వైసీపీ నాయకులే ఈసడించుకుంటు న్నారు. నిజానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం వినుకొండ. పల్నాడు ప్రాంతంలో ఉన్న ఈ నియోజ కవర్గం అన్ని విధాలా వెనుకబడిన ప్రాంతం. అయితే.. గతంలో రెండు సార్లు గెలిచిన టీడీపీ నాయకుడు జీవీ ఆంజనేయులు.. ఇక్కడ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో ఆయన స్వయంగా ట్యాంకర్లను పంపించి.. నీటిని ఇచ్చి ఆదుకున్నారు. భేష జాలు లేకుండా స్వయంగా ఆయన పర్యటించి.. ఇంటింటికీ తాగునీరు ఇచ్చారు. రహదారులు నిర్మించారు. అయితే.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడా కూడా ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో సొంత పార్టీ నాయకులే ఆయనపై వ్యతిరేక భావనతో ఉన్నారు. ప్రధానంగా తన వ్యాపారాలు అభివృద్ధి చేసుకునేందుకు రైతులను కూడా మోసగించారని వైసీపీ నాయకులే చెబుతున్నారు.
జగనన్న ఇళ్ల పథకంలో భాగంగా ముందుగానే తక్కు వధరలకు బినామీ పేర్లతో రైతుల నుంచి ఎకరాలకు ఎకరాలు స్థలాలను అత్యంత తక్కువ ధరలకు సేకరించి.. తర్వాత..వాటిని అత్యధిక ధరలకు ప్రభుత్వానికి అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని.. వైసీపీ నాయకులు అనేక సందర్భాల్లో ఆరోపించారు. అదేసమయంలో ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా.. ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయడం, దాడులు చేయించడం.. నియోజకవర్గంలో తనకు మాత్రమే హక్క ఉందన్నట్టుగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతో బొల్లా.. పరిస్థితి అల్లకల్లోలంగా ఉందనే టాక్ వినిపిస్తుం డడం గమనార్హం.