"ఆయుర్వేద రాణి"... ఇంట్లో ఈ మొక్క ఉంటే ఎన్ని ప్రయోజనాలో..!
తులసిని ఇంటి ఆవరణలో నాటడం శ్రేయస్సు సూచకంగా భావిస్తారు.
By: Tupaki Desk | 12 Oct 2024 10:30 PM GMTహిందూ సంస్కృతిలో మహిళలు తెల్లవారుజామున తులసిని పూజిస్తారు! ఇదే సమయంలో ఆయుర్వేదంలో తులసి మొక్కకు అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్క అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. తులసిని ఇంటి ఆవరణలో నాటడం శ్రేయస్సు సూచకంగా భావిస్తారు. ఈ క్రమంలో... ప్రధానంగా వేదాలలో ఈ మొత్తపై వివరణలు కూడా ఉన్నాయి.
అవును... తులసిలో ఉన్న ఔషధ గుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే అని అంటారు. తులసి ఆకుల రసాన్ని తేనె, అల్లంతో కలిపి తీసుకుంటే... దగ్గు, ఆస్తమా, ఇన్ ఫ్లు యెంజా, జలుబు, బ్రాంకైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. ఇదే సమయంలో.. చెవి నొప్పి వచ్చినప్పుడు తులసి నూనె ఉపయోగించి ఉపశమనం పొందొవచ్చని నిపుణులు చెబుతుంటారు.
ఇక నోటి పూత నుంచి ఉపశమనం పొందడానికి తులసి పొడిని ఉపయోగిస్తారు. తులసిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని చెబుతారు. వీటిలో ఉండే యూజినాల్, సినియోల్, కాంఫెన్ వంటి పదార్థాలు చాతి జలుబును తగ్గించడంలో సహాయపడతాయని అంటారు.
ఇలా తనకున్న ప్రత్యేక లక్షణాలతో ఆయుర్వేదంలో కలిగి ఉన్న తులసిని... ఆయుర్వేద రాణిగా, మూలికల దేవతగా పరిగణిస్తారు. ఇప్పుడు ఈ తులసి మొక్కను ఇంట్లో ఎలా నాటాలో చూద్దాం...!
ఇంట్లో తులసి మొక్క ఉండటం అన్ని రకాలుగానూ మంచిది అని చెబుతారు. ఈ క్రమంలో... ఇంట్లో తులసి మొక్కను నాటడానికి ముందుగా సరైన సూర్యరశ్మి తగిలే స్థలాన్ని ఎన్నుకోవాలి. తులసికి ప్రతీరోజు కనీసం 6 నుంచి 8 గంతల సూర్యకాంతి ఉండటం మంచిదని చెబుతారు. అనంతరం బాగా ఎండిన మట్టిని ఎంచుకోవాలి.
ఈ క్రమంలో తులసిని విత్తనంగా కానీ మొక్కగా కానీ నాటవచ్చు. అయితే... విత్తనాలను 0.5 నుంచి 1 అంగుళం లోతులో నేలలో విత్తాల్సి ఉంటుంది. ఇక మొక్క అయితే దాని సైజుని బట్టి జాగ్రత్తలో గుంతతీసి నాటాలి. అలా నాటిన తర్వాత నీరు అందించాలి. ఈ క్రమంలో... క్రమం తప్పకుండా నీరు ఇవ్వలి కానీ.. మట్టిని మత్రం పూర్తిగా తడిగా కాకుండా చూడాలి.
ఈ విధంగా తులసి మొక్కను నాటిన తర్వాత... ఆకులను కత్తిరించడం ద్వారా మొక్క దట్టంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.