'హరీష్ మాటలు బాధించాయి'.. తుమ్మల కంటతడి.. కీలక వ్యాఖ్యలు!
ఇందులో భాగంగా... ప్రచారం కోసం బటన్ లు నొక్కే తరహా వ్యక్తి తాను కాదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
By: Tupaki Desk | 13 Aug 2024 1:03 PM GMTమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటతడి పెట్టుకున్నారు. సీతారామ ప్రాజెక్ట్ విషయంలో మాజీ మంత్రి, బీఆరెస్స్ కీలక నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక దశలో కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ప్రచారం కోసం బటన్ లు నొక్కే తరహా వ్యక్తి తాను కాదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
అవును... ఖమ్మం జిల్లా క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కంటతడి పెట్టుకున్నారు. సీతారామ ప్రాజెక్ట్ గురించి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆస్తవాలు చెప్పాలనే ఈ ప్రెస్ మీట్ పెట్టినట్లు వెల్లడించారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో తన ఆవేదనను చెప్పదలచున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా భద్రాద్రి శ్రీ రామచంద్రుని దయవల్ల, ఎన్టీఆర్ ఆశీర్వాదంలో వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతుంటే.. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలం చేయాలనేది తన సంకల్పం అని అన్నారు. ఈ నేపథ్యంలోనే పోలవరం బ్యాక్ వాటర్ ఆధారంగా దుమ్ముగూడెం ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ చేపట్టాలని నాడు వైఎస్సార్ ని కోరినట్లు తెలిపారు.
అయితే వైఎస్సార్ అకాల మరణం తర్వాత ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ లు పూర్తవ్వలేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కోసమే కేసీఆర్ పిలుపు మేరకు నాడు టీఆరెస్స్ లో చేరినట్లు చెప్పిన తుమ్మల... కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పంప్ హౌస్ లు మాత్రమే నిర్ణాం చేశారని అన్నారు. అనంతరం రాహుల్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ లో చేరినట్లు చెప్పారు.
భద్రాచలం పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డికి సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. పాలేరు కరువుకు శాస్వత పరిష్కారంగా భక్త రామదాసు లిఫ్ట్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినట్లు తెలిపారు. తాను నిర్మాణం చేసిన సాగు నీటి ప్రాజెక్టులవల్ల రైతాంగం సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ప్రస్థావన తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు తనను చాలా బాధపెట్టాయని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. తాను ప్రచారం కోసం బటన్ నొక్కే పనులు చేయలేదని అన్నారు. తాను ప్రేక్షకుడిగా మాత్రమే నిలబడినట్లు చెప్పారు. తాను క్రెడిట్ కోసం ప్రాకులాడే మనిషిని కాదని, తనకు ఎకరం పొలం కూడా ఈ ప్రాజెక్ట్ కింద లేదని తుమ్మల తెలిపారు.