ట్యూషన్ కు వచ్చే కుర్రాడ్ని టీచర్ చెల్లెలు కిడ్నాప్
ఆ కుర్రాడు పదో తరగతి ఫెయిల్ అయ్యాడు. బ్యాలెన్స్ ఉన్న సబ్జెక్టులను క్లియర్ చేసేందుకు ఆ కుర్రాడి తల్లిదండ్రులు ట్యూషన్ లో చేర్పించారు.
By: Tupaki Desk | 2 Jan 2025 5:14 AM GMTఆ కుర్రాడు పదో తరగతి ఫెయిల్ అయ్యాడు. బ్యాలెన్స్ ఉన్న సబ్జెక్టులను క్లియర్ చేసేందుకు ఆ కుర్రాడి తల్లిదండ్రులు ట్యూషన్ లో చేర్పించారు. ఫెయిల్ అయిన సబ్జెక్టులను క్లియర్ చేసేందుకు వెళ్లే ట్యూషన్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఎప్పటిలానే ట్యూషన్ కు వెళ్లిన తమ కుమారుడు కనిపించకుండా పోయినట్లుగా అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ట్యూషన్ కు వెళ్లే టీచర్ చెల్లెలు ఈ కుర్రాడ్ని కిడ్నాప్ చేసినట్లుగా పేర్కొన్నారు. దీనికి కారణం పిల్లాడు మైనర్ కాగా.. సదరు ట్యూషన్ టీచర్ చెల్లెలు 23 ఏళ్లు ఉండటమే. చెన్నైలోని ఎంజీఆర్ నగర్ కు చెందిన ఈ పదిహేనేళ్ల కుర్రాడు ట్యూషన్ కు అని చెప్పి డిసెంబరు 16న బయటకు వెళ్లగా.. అప్పటి నుంచి కనిపించలేదు.
పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. విచారణ జరిపిన తర్వాత కానీ అసలు విషయాలు వెలుగు చూడలేదు. ట్యూషన్ టీచర్ చెల్లులు (23 ఏళ్లు).. కేకే నగర్ కు చెందిన రాహుల్ అనే వ్యక్తితో కలిసి పుదుచ్చేరికి వెళ్లినట్లుగా గుర్తించారు. దీంతో.. వారెక్కడ ఉన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు అక్కడకు వెళ్లగా.. కనిపించకుండా పోయిన బాలుడు కూడా అక్కడే దొరికాడు. పదో తరగతి ఫెయిల్ అయిన కుర్రాడు.. తాను ప్రేమించుకుంటున్నామని.. తమకు సాయం చేసేందుకు రాహుల్ తమతో వచ్చినట్లుగా సదరు యువతి వెల్లడించారు. బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.