Begin typing your search above and press return to search.

టీటీడీ చైర్మన్ గా ఎవరూ ఊహించని పేరు ?

అయితే ఎవరూ ఊహించని ఏ విధంగానూ ప్రచారంలోకి రాని ఒక బిగ్ షాట్ ఈ పదవిని అందుకోబోతున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   8 Aug 2024 4:57 AM GMT
టీటీడీ చైర్మన్ గా ఎవరూ ఊహించని పేరు ?
X

ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ పదవిని ఎవరికి ఇస్తున్నారు అన్న చర్చ రెండు నెలలుగా ఉంది. సీఎం గా ఎవరు ఉంటారో అన్నది కూటమి ప్రభుత్వంలో అందరికీ తెలిసిందే. దాని తరువాత మంత్రులు ఎవరు అన్నది కూడా ఆసక్తికరమైన చర్చ సాగింది. అలాంటి మరో చర్చగానే టీటీడీ చైర్మన్ పదవి కూడా ఉంది.

ఈ పోస్ట్ ఒక కేబినెట్ మినిస్టర్ పదవితో సమానం దేవదేవుడు ఆ శ్రీవారి సేవలో తరించడం అంటే ఇహమూ పరమూ అని నమ్మేవారు అనేక మంది ఉన్నారు. దాంతో ఈ కీలకమైన పదవి కోసం సినీ ప్రముఖుల నుంచి చాలా మంది పేర్లు వినిపించాయి. ఇక ఒకరిద్దరి పేర్లు అయితే కన్ఫర్మ్ అని కూడా అనుకున్నారు.

టీడీపీ అభిమానిగా మాజీ ఎంపీగా సినీ ప్రముఖుడిగా ఉన్న మురళీమోహన్ విషయంలోనూ ఈ పదవి మీద ఆశ ఉందని ఆయనకు దక్కుతుందని ప్రచారం సాగింది. ఒక దశలో మెగా బ్రదర్ నాగబాబు పేరు కూడా వినిపించింది. ఆయనకే ఈ పదవి అన్నారు. కానీ నాగబాబే ఖండించారు. ఇక టీడీపీలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పేరు వినిపించింది కానీ ఆయనకు వేరే పెద్ద పదవి ఆఫర్ లో ఉందని అన్నారు.

ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి నెల్లూరు ఎంపీ అయిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని ఈ పదవి కోసం అడిగారని ఆయన సున్నితంగా వద్దు అని చెప్పారనీ ప్రచారం నడిచింది. ఇపుడు నామినేటెడ్ పదవుల భర్తీకి తెర లేస్తోంది. దీంతో టీటీడీ చైర్మన్ పదవి విషయం తేలిపోనుంది

అయితే ఎవరూ ఊహించని ఏ విధంగానూ ప్రచారంలోకి రాని ఒక బిగ్ షాట్ ఈ పదవిని అందుకోబోతున్నారు అని అంటున్నారు. ఆయన తెలుగు ప్రముఖ టీవీ చానల్ యజమాని. టీడీపీ అనుకూలంగా ఉంటారు. ఆయన గత అయిదేళ్లలో వైసీపీకి వ్యతిరేకంగా నిలబడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా వెరవకుండా ఆయన టీడీపీకి అండగా ఉంటూ వచ్చారు.

దాంతో ఆయనకు ఈ అత్యున్నతమైన పదవిని ఎంతో విలువైన పదవిని ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. దానిని కూటమి మిత్రుల నుంచి కూడా మద్దతు దక్కిందని అంటున్నారు. ఇలా అందరూ ఆమోద ముద్ర వేయడంతో నామినేటెడ్ పదవుల ప్రకటనలో అగ్ర తాంబూలంగా ఆయన పేరే ముందు రావచ్చు అని అంటున్నారు.

అంతే కాదు ఆయనకు ఈ పదవి కట్టబెట్టడం ద్వారా ఒక బలమైన సామాజిక వర్గానికి ఎన్నడూ దక్కని టీటీడీ చైర్మన్ పదవిని దక్కించినట్లు అవుతుందని అలా సామాజిక లెక్కలూ సరిపోతాయని భావిస్తున్నారు. మొత్తం మీద అతి త్వరలో టీటీడీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుంది అన్న ప్రకటన అయితే రానుంది అని అంటున్నారు.