Begin typing your search above and press return to search.

'ఎక్స్' మ‌రింత భ‌ద్రం.. మ‌స్క్ అదిరిపోయే ఫీచ‌ర్‌

సోష‌ల్ మీడియా దిగ్గజ సంస్థ ఎక్స్‌(గ‌తంలో ట్విట్ట‌ర్‌) అధినేత ఎలాన్ మ‌స్క్ త్వ‌ర‌లోనే అధిరిపోయే ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు

By:  Tupaki Desk   |   28 Jan 2024 4:30 PM GMT
ఎక్స్ మ‌రింత భ‌ద్రం.. మ‌స్క్ అదిరిపోయే ఫీచ‌ర్‌
X

సోష‌ల్ మీడియా దిగ్గజ సంస్థ ఎక్స్‌(గ‌తంలో ట్విట్ట‌ర్‌) అధినేత ఎలాన్ మ‌స్క్ త్వ‌ర‌లోనే అధిరిపోయే ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎక్స్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఆద‌ర‌ణ ఉండ‌డంతో ఆయ‌న ఈ సోష‌ల్ మీడియా మాధ్య‌మానికి మ‌రింత ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని.. భ‌ద్ర‌త‌ను మ‌రింత పెంచాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో కొత్త ఫీచ‌ర్‌ను త్వ‌ర‌లోనే అందుబాటులోకి తెచ్చేందుకు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ప‌నిచేస్తున్నారు.

విష‌యం ఏంటంటే.. ఎక్స్‌లో ఇటీవ‌ల‌కాలంలో అబ్యూజివ్ లాంగ్వేజ్ స‌హా.. వీడియోలు, పోర్న్ వంటివి పెరిగాయ‌నే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వీటిని క‌ట్టడి చేసి.. ఎక్స్‌ను గౌర‌వ ప్ర‌ద‌మైన మాధ్య‌మంగా తీర్చిదిద్దాల‌ని మ‌స్క్ నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో కంటెంట్, భద్రతా నియమాలను అమలు చేయడంలో భాగంగా కొత్త "ట్రస్ట్ అండ్ సేఫ్టీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్"ని నిర్మించ‌నున్నారు. దీనిలో 100 మందికిపైగా కంటెంట్ మోడరేటర్‌లను నియమించ‌నున్నారు. వీరు ఎప్ప‌టిక‌ప్పుడు కంటెంట్ భ‌ద్ర‌త‌తోపాటు.. అబ్యూజివ్‌ను తొల‌గిస్తారు. లేదాహెచ్చ‌రిస్తారు.

ఇదీ.. మార్పు..

మ‌స్క్ తాజా నిర్ణ‌యంతో ఎక్స్ లో జ‌ర‌గ‌బోయే మార్పులు ఇవీ..

+ చిన్నారుల లైంగిక దోపిడీకి సంబంధించిన వీడియోలు, చిత్రాల‌ను నిరోధిస్తారు.

+ దేశాల మ‌ధ జ‌రుగుతున్న యుద్దాల్లో విధ్వంసాల పోస్టుల‌ను నిలువ‌రిస్తారు.

+ మ‌త సంబంధిత వ్య‌వ‌హారాల్లో విపరీత ధోర‌ణుల ప్ర‌చారాల‌ను అడ్డుకుంటున్నారు.

+ ద్వేషపూరిత ప్రసంగాలను వెంట‌నే డిలీట్ చేస్తారు.

+ హింసాత్మక పోస్ట్‌లపై పరిమితులు విధించనున్నారు.

+ ఎక్స్‌ ఖాతా తెరిచేందుకు కనీస వ‌య‌సును 13 ఏళ్లుగా నిర్ధారించ‌నున్నారు