Begin typing your search above and press return to search.

లెక్క‌కు మిక్కిలి పార్టీలు.. వైసీపీకి మేలా... కీడా...

అయితే.. ఎటొచ్చీ.. ఇప్పుడు జ‌న‌సేన‌-టీడీపీల పొత్తుతో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా.. పొతుంద‌నే బెంగ వైసీపీని వెంటాడుతోంది.

By:  Tupaki Desk   |   5 Dec 2023 2:30 AM GMT
లెక్క‌కు మిక్కిలి పార్టీలు.. వైసీపీకి మేలా...  కీడా...
X

ఏపీలో వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను అధికార పార్టీ వైసీపీ ప్ర‌తిష్టాత్మ కంగా బావిస్తున్న విష‌యం తెలిసిందే. ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారంలోకి రావాల‌ని.. సీఎం జ‌గ‌న్ ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌లకు మ‌రింత చేరువ చేస్తున్నారు. ఎమ్మెల్యేల ను తిప్పుతున్నారు. తాను కూడా తిరిగేందుకు రెడీ అయ్యారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది.

అయితే.. ఎటొచ్చీ.. ఇప్పుడు జ‌న‌సేన‌-టీడీపీల పొత్తుతో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా.. పొతుంద‌నే బెంగ వైసీపీని వెంటాడుతోంది. వాస్త‌వానికి ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలితే.. త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌నే ది వైసీపీ వ్యూహం. ఇప్పుడు ఈ విష‌యంపైనే జ‌న‌సేన కూడా వ్యూహాత్మ‌కంగా ముందుకు క‌దిలి వ్య‌తిరేక ఓటు చీల‌కుండా చూస్తాన‌ని చెబుతోంది ఇదిలావుంటే.. ఇప్పుడు వైసీపీలో ఒక చ‌ర్చ తెర‌మీద‌కి వ‌చ్చింది. రాష్ట్రంలో పుట్ట‌గొడుగుల్లా వెలుస్తున్న పార్టీలు త‌మ‌కు మేలు చేస్తాయ‌ని వారు అంటున్నారు.

ఇప్ప‌టికే ప్ర‌జాశాంతి పార్టీ, జైభీమ్ రావ్‌ పార్టీ, ఎంఆర్పీఎస్ పార్టీ, ఆప్‌, రాయ‌ల‌సీమ గ‌ర్జ‌న పార్టీ, బీఎస్పీ, అమ‌రావ‌తి జేఏసీ పార్టీలు.. ఉన్నాయి. ఇవ‌న్నీ. కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతున్నాయి. వీటిలో కొన్ని సామాజిక వ‌ర్గాల‌ప‌రంగా.. మ‌రికొన్ని.. మేదావుల ప‌రంగా.. ఇంకొన్ని సెంటిమెంటు ప‌రంగా ఓట్ల‌ను చీల్చ‌నున్నాయి. ఇక‌, ఇప్పుడు మ‌రో పార్టీ తెర‌మీదికి వ‌చ్చింది. అదే.. ఏపీ పెన్ష‌న‌ర్స్ పార్టీ. ఏపీ పింఛ‌ను దారుల అసోసియేష‌న్ అద్య‌క్షుడు సుబ్బ‌రాయ‌న్ నేతృత్వంలో ఈ పార్టీని ఏర్పాటు చేశారు.

దీనిలో ఐఏఎస్‌ల నుంచి ఐపీఎస్ ల‌వ‌ర‌కు.. గ్రూప్ ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన వారు కూడా ఉన్నా రు. వీరంతా క‌లిసి.. పార్టీని స్థాపించుకున్నారు. త్వ‌ర‌లోనే దీనిని ఎన్నిక‌ల సంఘం వద్ద రిజిస్ట‌ర్ కూడా చేయించ‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అర్బ‌న్‌, పట్ట‌ణ ప్రాంతాల్లోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ రిటైర్డ్ ఉద్యోగులు పోటీ చేయ‌నున్నార‌ని.. ఈ సంఘం ప్ర‌క‌టించింది. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇప్ప‌టికే ఉన్న చిన్నా చిత‌క పార్టీలు, ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చిన పార్టీల‌తో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీలితే.. అది అంతిమంగా.. వైసీపీకి మేలు చేస్తుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు అంటున్నారు.