Begin typing your search above and press return to search.

ఏపీలో కూటమి వస్తే ఆ ఇద్దరు రెడ్లూ మంత్రులేనా ?

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది అన్న అంచనాలు ఉన్న నేపధ్యంలో మంత్రి పదవుల మీద కూడా చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   29 May 2024 10:00 AM GMT
ఏపీలో కూటమి వస్తే ఆ ఇద్దరు రెడ్లూ మంత్రులేనా ?
X

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది అన్న అంచనాలు ఉన్న నేపధ్యంలో మంత్రి పదవుల మీద కూడా చర్చ సాగుతోంది. ఆశావహులు ఎంతమంది ఉన్నా ఎవరెవరికి చాన్స్ దక్కుతుంది అన్నది మాత్రం ఎడ తెగని చర్చగానే ఉంది. ఇదిలా ఉంటే ఏపీలో కూటమి వస్తుంది అని ఎవరి మటుకు వారు లెక్కలేసుకుంటున్నారు.

కులాలపరంగా కూడా తమకు అవకాశాలు వస్తాయని గట్టి ధీమాతో ఉన్నారు. మంత్రులు ఫలానా వారు కావచ్చు అన్నది కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇక చూస్తే ఈసారి చాలా కొత్త సామాజిక సమీకరణలు చూస్తారు అని అంటున్నారు. రెడ్లు కూడా టీడీపీ నుంచి బాగానే గెలుస్తారు అని అంటున్నారు.

ఇక గతంలో టీడీపీ హయాంలో రెడ్లకు ప్రాధాన్యత కల్పించారు. ఈసారి కూడా అదే విధంగా చేస్తారు అని అంటున్నారు. అలా చూస్తే కనుక సామాజిక వర్గాల పరంగా ఇద్దరు రెడ్లకు చాన్స్ కచ్చితంగా కొత్త క్యాబినెట్ లో ఉంటుందని అంటున్నారు.

ఎందుకు ఇదంతా అంటే వైసీపీ వస్తే నలుగురు రెడ్లకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుంది. అదే ఫార్ములాను అనుసరిస్తే టీడీపీ కూటమి వస్తే నలుగురు కమ్మలకు మంత్రి పదవులు ఇస్తారు అని ప్రచారం సాగుతోంది. ఇక ఏపీలో చూస్తే బీసీల జనాభా ఎక్కువే. అందువల్ల ఒక్కో కులానికి ఒక మంత్రి పదవి అయినా ఇవ్వాల్సి ఉంటుంది.

అలాగే ఎస్సీ కి ఒకరికి, ఎస్టీస్ ఒకరికి, ముస్లిమ్స్ లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో ఈసారి టీడీపీ రెడ్లకు బాగానే టికెట్లు ఇచ్చింది. వారిలో గెలుపు అవకాశాలు ఉన్న వారు అనేక మంది ఉన్నారు. వారు భారీగా గెలిస్తే ఏమి చేస్తారు అన్నదే చర్చ. అంటే రెడ్లకు మంత్రివర్గంలో ఎన్ని బెర్తులు కేటాయిస్తారు అన్నది కూడా ఊహాగానాలు చేస్తున్నారు.

ఇక రాయలసీమలోని డోన్ లో గెలిస్తే మాజీ సీఎం కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి హోదాలో కోట్ల సూర్య ప్రకాష్ రెడ్దికి మంత్రి పదవి కచ్చితంగా ఇస్తారు అని అంటున్నారు. అదే విధంగా చూస్తే ఇక చిత్తూరు జిల్లా నుంచి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి కానీ అలాగే అనంతపురం జిల్లా నుంచి జేసీ అస్మిత్ రెడ్డికి కానీ మంత్రి పదవి కట్ట పెట్టవచ్చు అన్నది కూడా మరో చర్చగా ఉంది.

అయితే మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డి ఉన్నా ఈసారి అతనికి చాన్స్ ఇవ్వకపోవచ్చు అని అంటున్నారు. వైసీపీతో బాగా ఫైట్ చేసే జేసీ కుటుంబంలో ఒకరికి కానీ నల్లారి ఫ్యామిలీకి కానీ మంత్రి పదవి ఇస్తారు అని అదే పక్కా లెక్క అని అంటున్నారు.

మరో వైపు చూస్తే వైసీపీ పోలింగ్ తరువాత ఎందుకో తెలియదు కానీ ఫుల్ సైలెంట్ అయింది. ఆ పార్టీలో మంత్రి పదవుల దాకా చర్చలే సాగడం లేదు. నిజం చెప్పాలంటే మంత్రి పదవి నాకు అంటే నాకు అన్న లెవెల్ లో చర్చ ఈపాటికే సాగి ఉండాలి. అధికార పార్టీ కాబట్టి అవకాశం ఉన్న వారు ఆశావహులు మరోసారి ప్రయత్నం చేయడానికే చూస్తారు.

కానీ ఎందుకో తెలియదు కానీ వైసీపీలో చూస్తే ఆ రకమైన డిబేట్ అయితే కనిపించడం లేదు అని అంటున్నారు. వైసీపీ గెలుపు మీద అంత బజ్ లేదనే అంటున్నారు. ఇక సైలెంట్ ఓటింగ్ మీద మహిళా ఓటింగ్ మీద వైసీపీ పూర్తి నమ్మకం పెట్టుకున్నా గెలుస్తుందా అన్న చర్చ కూడా మరో వైపు సాగుతోంది. వైసీపీ గెలుపు మీద అనుమానం సొంత పార్టీలోనే ఉంది అని అంటున్నారు.

దాంతోనే ఆ పార్టీలో హడావుడి కానీ జోరు కానీ పెద్దగా కనిపించడం లేదు అని అంటున్నారు. ఈ రకమైన రాజకీయ పరిణామాలలో ఏపీలో టీడీపీ కూటమి గెలుస్తుంది అని అంటున్నారు. దాంతోనే మంత్రి పదవుల గురించి కూడా బిగ్ డిబేట్ అన్నది స్టార్ట్ అయిపోయింది. మరి ఏపీలో టీడీపీ కూటమి వస్తే రెడ్లకు సముచిత స్థానం ఉంటుంది అని అంటున్నారు. అదే విధంగా మిగిలిన సామాజిక వర్గాల వారికి కూడా అవకాశం ఈసారి తప్పకుండా దక్కుతుంది అని అంటున్నారు. అంతే కాదు గతంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం జరిగే వీలు ఉంటుందని అంటున్నారు.