Begin typing your search above and press return to search.

పల్నాడులో 144 సెక్షన్... ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు హౌస్ అరెస్ట్!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో మొదలైన ఉధ్రిక్తవాతావరణం కంటిన్యూ అవుతుంది.

By:  Tupaki Desk   |   15 May 2024 7:42 AM GMT
పల్నాడులో 144 సెక్షన్...  ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు హౌస్  అరెస్ట్!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో మొదలైన ఉధ్రిక్తవాతావరణం కంటిన్యూ అవుతుంది. ప్రధానంగా పల్నాడు జిల్లాల్లో పోలింగ్ రోజు నెలకొన్న ఉద్రిక్తతలు మూడో రోజూ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. అయినా దాడులు ఆగడం లేదని తెలుస్తుంది. ఈ తరుణంలో వైసీపీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

అవును... పల్నాడులో పరిస్థితి ఇప్పటికీ టెన్షన్ టెన్షన్ గా ఉందని అంటున్నారు. వాస్తవానికి ఎన్నికల ప్రచార సమయంలోనూ అడపా దడపా అసాంఘిక శక్తుల ఆగడాలు తెరపైకి వచ్చినా... పోలింగ్ రోజు మాత్రం ఇవి పీక్స్ కి చేరిన పరిస్థితి. ఈ సమయంలో పోలీసులు మరింత స్ట్రిక్ట్ గా మారారని అంటున్నారు.

వాస్తవానికి పల్నాడులో చెలరేగిన హింసలో ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడులు జరిగాయి! దీంతో... వీరి అనుచరులు కూడా భారీ ఎత్తున దాడులకు పాల్పడ్డారని అంటున్నారు. ఈ దాడులు, ప్రతిదాడుల్లో పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయని చెబ్బుతున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో... పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు వీరిద్దరినీ హౌస్ అరెస్టు చేశారు పోలీసులు!

ఈ సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఇదే సమయంలో వీరి ఇళ్ల వైపు ఇతర ప్రాంతాల నుంచి సాగే రాకపోకలను కూడా నియంత్రిస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో దాడులకు పాల్పడిన వారిని గుర్తించి ఇప్పటికే కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేస్తున్నారని అంటున్నారు.

దీంతో క్రమంగా పరిస్ధితి అదుపులోకి వస్తోందని చెబుతున్న పోలీసులు.. ఈ సమయంలో నేతలు ఎవరూ బయటకు రావొద్దని సూచిస్తున్నారని సమాచారం! ఇదే సమయంలో మొత్తం 19 కంపెనీల బలగాలను ఇక్కడ మోహరించారని తెలుస్తుంది. గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాచర్లలోనే ఉండి పర్యవేక్షిస్తుండగా.. పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ కూడా అక్కడే ఉన్నారు. మాచర్లలో అడుగడుగునా పోలీసులు మోహరించారు.