నిన్న కానిస్టేబుల్ - నేడు సివిల్స్ ర్యాంకర్... తెలుగువాడి ఆసక్తికర ప్రయాణం!
అవును... ఉదయ్ కృష్ణారెడ్డి 2012లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ క్రమంలో... 2019 వరకు ఆ ఉద్యోగం చేశాడు.
By: Tupaki Desk | 17 April 2024 10:05 AM GMTతాజాగా సివిల్స్ - 2023 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో పలు తెలుగు తేజాలూ మెరసాయి! ఈ క్రమంలో... ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణా రెడ్డి తాజాగా విడుదలైన ఫలితాల్లో 780వ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా సీఐ అవమానించాడాన్ని ఛాలెంజ్ గా తీసుకుని సివిల్స్ విజేతగా నిలిచారు!
అవును... ఉదయ్ కృష్ణారెడ్డి 2012లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ క్రమంలో... 2019 వరకు ఆ ఉద్యోగం చేశాడు. అయితే... తోటి ఉద్యోగుల ముందు ఓ సీఐ తనను తీవ్రంగా అవమానించటాన్ని ఉదయ్ తట్టుకోలేకపోయాడట. దీంతో... అవమానాన్ని చాలెంజ్ గా తీసుకున్న కృష్ణారెడ్డి... కీలక నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా... వెంటనే కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సివిల్స్ కు సన్నద్ధమయ్యాడు. నాలుగో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంక్ సాధించాడు.
పూర్తి వివరాళ్లోకి వెళ్తే... ఏపీలోని ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, ఊళ్లపాలెం గ్రామానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అప్పటి నుంచీ తన నానమ్మ దగ్గరే పెరిగాడు. ఈ క్రమంలోనే 2012లో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాడు. ఆ ఉద్యోగంలో ఏడేళ్లు పనిచేశాక.. రాజీనామా చేసి సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడు. మూడుసార్లు సక్సెస్ కాలేకపోయినా పట్టు వదలలేదు.. నాలుగో ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు!
ఈ సందర్భంగా స్పందించిన ఉదయ్... 60 మంది పోలీసుల ముందు ఓ సీఐ తనను తీవ్రంగా అవమానించాడని.. వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడని తెలిపారు. ఈ క్రమంలోనే ఆ కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆ వెంటనే సివిల్స్ కు ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లు తెలిపాడు.. నాలుగో ప్రయత్నంలో సక్సెస్ అయినట్లు వెల్లడించాడు!
సివిల్స్ లో మెరిసిన తెలుగు తేజాలు!:
దోనూరు అనన్య రెడ్డి - 3 ర్యాంక్
నందల సాయికిరణ్ - 27
మేరుగు కౌశిక్ - 82
పెంకీసు ధీరజ్ రెడ్డి - 173,
జి.అక్షయ్ దీపక్ - 196
గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ - 198
నిమ్మనపల్లి ప్రదీప్ రెడ్డి - 382
బన్న వెంకటేశ్ - 467
కడుమూరి హరిప్రసాద్ రాజు - 475
పూల ధనుష్ - 480
కె. శ్రీనివాసులు - 526
నెల్లూరు సాయితేజ - 558
కిరణ్ సాయింపు - 568
మర్రిపాటి నాగభరత్ - 580
పోతుపురెడ్డి భార్గవ్ - 590
వద్యావత్ యశ్వంత్ నాయక్ - 627
కె. అర్పిత - 639
ఐశ్వర్య నెల్లిశ్యామల - 649
సాక్షి కుమారి - 679
చౌహాన్ రాజ్ కుమార్ - 703
గాదె శ్వేత - 711
వి. ధనుంజయ్ కుమార్ - 810
లక్ష్మీ బానోతు - 828
ఆదా సందీప్ కుమార్ - 830
జె. రాహుల్ - 873
హనిత వేములపాటి - 887
కె. శశికాంత్ - 891
కెసారపు మీన - 899
రావూరి సాయి అలేఖ్య - 938
గోవద నవ్యశ్రీ - 995 ర్యాంకుల్లో మెరిశారు.