జనసేన అభ్యర్థి ఉదయ్‌పై అనర్హత కత్తి.. వైసీపీ పోరాటం!
జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి.. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌పై అనర్హత కత్తి వేలాడుతోంది.
By: Tupaki Desk | 3 May 2024 5:30 AM GMTజనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి.. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌పై అనర్హత కత్తి వేలాడుతోంది అని అంటున్నారు . ప్రస్తుతం ఆయన కాకినాడలో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన తరఫున పవన్ కళ్యాణ్ కూడా బాగానే శ్రమిస్తున్నారు. అయితే.. ఎటొచ్చీ.. ఉదయ్ సమర్పించిన అఫిడవిట్‌లో ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులను దాచారనేది.. వైసీపీ చెబుతున్న మాట. ఇదే విషయాన్ని కేంద్ర హోం శాఖ, విదేశాంగ శాఖల దృష్టికి కూడా తీసుకువెళ్లింది. ఉదయ్ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించేలా చూడాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.
ఏం జరిగింది?
`టీ-టైమ్` వ్యాపారంతో కోట్ల రూపాయలు గడించిన ఉదయ్ శ్రీనివాస్.. గతంలో దుబాయ్‌లో నివసించారు. అప్పట్లో అక్కడ ఆయనపై కేసులు నమోదు కావడంతోపాటు కోర్టులో ఆరు నెలల జైలు, భారీ జరిమానా 120000 ధిరామ్‌ల కూడా విధించారు అవి విచారం దశలో ఉన్నాయ్ అని ఒక ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది ఇందులో ఎంత నిజం అనేది తెలియదు. ఎలక్షన్ ఏ వార్త నిజం ఏది ఫేక్ అనేది కూడా తెలియడం లేదు.
అంతేకాదు, ఉదయ్ పై అక్కడి ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 4న లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేసిందని.. వైసీపీ వెల్లడించింది. కేంద్ర విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్‌ను ఉదయ్‌ను పరిచయం చేస్తూ.. ఇంజనీరింగ్ చదివారని చెబుతున్నారని.. కానీ, అఫిడవిట్‌లో మాత్రం ఇంటర్ చదివినట్టు పేర్కొన్నారని.. బ్యాచలర్ ఆఫ్ ఇంజనీరింగ్‌ను మధ్యలోనే వదిలేసినట్టు పేర్కొన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఇక, కాకినాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సలాది ఉదయ భాస్కర్ కూడా.. ఇవే ఆరోపణలు చేస్తున్నారు. ఈయన సైతం నామినేషన్ తిరస్కరణకు, అనర్హతకు డిమాండ్ చేస్తున్నారు. ఇవేవీ అఫిడవిట్‌లో పేర్కొనకుండా.. ఓటర్లను తప్పుదోవ పట్టించారనేది ఉదయ్ శ్రీనివాస్‌పై వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలని పట్టుబడుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇదిలావుంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా.. ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నటుడిగా తనకు ఏడాదికి వెయ్యి కోట్ల సంపాదన ఉంటుందని బహిరంగ సభలలో చెబుతున్నారని.. కానీ, అఫిడవిట్‌లో మాత్రం కేవలం 114 కోట్లుగానే చూపించారని వైసీపీ చెబుతోంది. దీనిపైనా చర్యలు తీసుకోవాలని కోరుతుండడం గమనార్హం.