Begin typing your search above and press return to search.

స్టాలిన్ కి పుత్రోత్సాహం...డిప్యూటీగా ఉదయనిధి

కానీ తీరా చూస్తే పార్టీలో కుటుంబంలో వర్గ పోరు ఉంది. అది స్టాలిన్ అన్నయ్య అళగిరితో వచ్చింది.

By:  Tupaki Desk   |   29 Sep 2024 3:33 AM GMT
స్టాలిన్ కి పుత్రోత్సాహం...డిప్యూటీగా ఉదయనిధి
X

డీఎంకేలో మరో కొత్త అంకం స్టార్ట్ అయింది. సరిగ్గా అయిదున్నర పదుల వయసులో స్టాలిన్ తన తండ్రి కరుణానిధి సీఎం గా ఉండగా డిప్యూటీ సీఎం అయ్యారు. ఇది 2005 ప్రాంతంలో జరిగింది. అప్పట్లో డీఎంకే గెలిస్తే స్టాలిన్ సీఎం అని అంతా అనుకున్నారు. ప్రచారం కూడా స్టాలిన్ మొత్తం నిర్వహించి పార్టీని గెలిపించారు

కానీ తీరా చూస్తే పార్టీలో కుటుంబంలో వర్గ పోరు ఉంది. అది స్టాలిన్ అన్నయ్య అళగిరితో వచ్చింది. దాంతో తమ్ముడు సీఎం అయితే ఒప్పుకోను అని అళగిరి అన్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అప్పటికే ఎనభైల మధ్యలో పడిన కరుణానిధి ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎత్తుకున్నారు.

అయితే తన తరఫున మొత్తం పాలన సాగించేందుకు వీలుగా కుమారుడు స్టాలిన్ ని ఉప ముఖ్యమంత్రిగా చేశారు. అలా పేరుకు కరుణానిధి సీఎం అయినా అంతా చూసింది స్టాలిన్ గానే ఉంది. ఆ విధంగా పార్టీ మీద ప్రభుత్వం మీద పట్టు సాధించారు స్టాలిన్. ఇక 2011, 2016లో డీఎంకే వరసగా ఓటమి పాలు కావడంతో స్టాలిన్ సీఎం కల నెరవేరలేదు. కరుణానిధి కూడా కళ్ళారా చూడలేకపోయారు.

అయితే 2021లో స్టాలిన్ సీఎం అయ్యారు. సరిగ్గా మూడున్నరేళ్ళ తరువాత కుమారుడిని డిప్యూటీ సీఎం చేస్తున్నారు. ఇక స్టాలిన్ మంత్రివర్గంలో చాలా కాలం క్రితమే ఉదయనిధి మంత్రిగా కీలకంగా ఉన్నారు. పైగా పార్టీలో యువజన విభగాలను చూస్తున్నారు

మరో వైపు చూస్తే ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. డీఎంకేలో వరసగా తండ్రీ కొడుకులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యంత్రులుగా ఉన్న రికర్డు కరుణానిధి కుటుంబంలోనే జరిగింది. ఇక స్టాలిన్ రికార్డు ఏంటి అంటే తండ్రికి డిప్యూటీగా చేశారు. కుమారుడిని తన డిప్యూటీగా చేసుకుంటున్నారు.

చాలా కాలంగా ఉదయనిధి ఉప ముఖ్యమంత్రి అవుతారు అని ప్రచారం సాగుతోంది. ఇన్నాళ్ళకు అది కార్యరూపం దాల్చింది. మరో ఏణ్ణర్ధంలో ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఈసారి తనతో పాటు కుమారుడు ఉదయనిధి కూడా పూర్తిగా పార్టీ ప్రభుత్వం బాధ్యతలు మోసేలా స్టాలిన్ ఆయనకు ఈ ప్రమోషన్ ఇస్తున్నారు అని అంటున్నారు.

అలాగే చూస్తే కనుక తమిళనాడులో సినీ స్టార్ విజయ్ పార్టీ కొత్తగా పెట్టారు. ఆయనను ఢీ కొట్టడానికి యువకుడు అయిన ఉద్యనిధిని ఈ విధంగా ప్రమోషన్ ఇచ్చి ముందుకు తెస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి డీఎంకేలో ఈ కొత్త డిప్యూటీ ఏ విధంగా వ్యవహరిస్తారు పార్టీకి ఏ విజయాలు సాధించి పెడతారు అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే కరుణానిధికి డిప్యూటీగా చేసిన స్టాలిన్ 2011, 2016లో పార్టీకి సక్సెస్ తేలేకపోయారు. యాంటీ ఇంకెంబెన్సీతో పార్టీ ఓటమి పాలు అయింది. ఇపుడు అయిదేళ్ల పాలన తరువాత గెలుపు కత్తి మీద సాముగా ఉంది. అదే సమయంలో కొత్త పార్టీతో విజయ్ వస్తున్నారు

అయితే తమిళనాడులో డీఎంకే ఇండియా కూటమిలో ఉంది. అందులో కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఉన్నారు. దాంతో పటిష్టమైన ఓటు బ్యాంక్ తో ఉంది. అదే సమయంలో ప్రతిపక్షం వీక్ గా ఉంది. పైగా ఓట్ల చీలిక కూడా ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ పార్టీ అన్నా డీఎంకే కలిసేది ఉండదు, బీజేపీ కూడా సొంతంగా పోటీ చేస్తుంది. దాంతో మరోసారి 2026లో డీఎంకే విజయం ఖాయమని కూడా అంటున్నారు. అదే జరిగితే ఉదయనిధి సీఎం అయినా ఆశ్చర్యం లేదు. ఆ స్టెప్ కోసమే ఇపుడు ఈ ప్రమోషన్ అని కూడా అంటున్నారు.