దేశంలోని నకిలీ వర్సిటీల జాబితాను విడుదల చేసిన యూజీసీ
కీలక వివరాల్ని వెల్లడించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.. పొట్టిగా చెప్పాలంటే యూజీసీ.
By: Tupaki Desk | 22 Aug 2024 4:13 AM GMTకీలక వివరాల్ని వెల్లడించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.. పొట్టిగా చెప్పాలంటే యూజీసీ. దేశ వ్యాప్తంగా 21 నకిలీ వర్సిటీలు ఉన్నట్లుగా తేల్చింది. వాటి వివరాల్ని కూడా వెల్లడించింది. ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. గత ఏడాది 20 ఫేక్ వర్సిటీల వివరాల్ని వెల్లడించిన యూజీసీ.. ఈ ఏడాది ఆ సంఖ్య 21కు చేరుకుందన్న విషయాన్ని వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో.. అత్యధిక ఫేక్ వర్సిటీలు దేశ రాజధాని ఢిల్లీలోనే ఉండటం గమనార్హం.
దేశ వ్యాప్తంగా 21 ఫేక్ వర్సిటీలు ఉంటే.. అందులో ఎనిమిది అంటే దాదాపు 40 శాతం నకిలీ విశ్వవిద్యాలయాలు ఢిల్లీలో ఉన్నట్లు తేల్చింది. తర్వాతి స్థానాల్లో యూపీలో 4, ఏపీ.. పశ్చిమ బెంగాల్.. కేరళలో రెండేసి చొప్పున నకిలీ వర్సిటీలు ఉండగా.. కర్ణాటక.. మహారాష్ట్ర.. పుదుచ్చేరిలలో మాత్రం ఒకటి చొప్పున ఫేక్ వర్సిటీలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ నకిలీ వర్సిటీలకు డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదన్న విషయాన్ని గతంలోనే యూజీసీ వెల్లడించింది.
యూజీసీ చట్టంలోని నిబంధనల్ని పాటించకుండా.. నకిలీ వర్సిటీలు ప్రదానం చేసే డిగ్రీలు.. ఉన్నత విద్య.. ఉద్యోగ ప్రయోజనాల కోసం గుర్తించమని యూజీసీ పేర్కొంది. అంతేకాదు.. సదరు ఫేక్ వర్సిటీలు జారీ చేసిన డిగ్రీలు ఫేక్ గా స్పష్టం చేసింది. ఇంతకూ నకిలీ వర్సిటీల జాబితాలోకి వెళితే..
ఢిల్లీలో 8 ఫేక్ వర్సిటీలివే..
- ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్
- కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్ - దర్యాగంజ్
- యునైటెడ్ నేషన్స్ వర్సిటీ
- వొకేషనల్ వర్సిటీ
- ఏడీఆర్.. సెంట్రిక్ జ్యూరిడికల్ వర్సిటీ
- ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్
- విశ్వకర్మ ఓపెన్ వర్సిటీ ఫర్ సెల్ప్ ఎంప్లాయిమెంట్
- ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయం
ఉత్తరప్రదేశ్ లోని 4 ఫేక్ వర్సిటీలు ఇవే..
- గాంధీ హిందీ విద్యాపీఠ్, ప్రయాగ్ రాజ్
- భారతీయ శిక్షా పరిషత్
- మహామయ టెక్నికల్ వర్సిటీ
పశ్చిమ బెంగాల్ లోని 2 ఫేక్ వర్సిటీలు
- ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్
- ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చి
కేరళలోని 2 ఫేక్ వర్సిటీలు ఇవే
- సెయింట్ జాన్స్ వర్సిటీ
- ఇంటర్నేషనల్ ఇస్లామిక్ వర్సిటీ ఆఫ్ ప్రొఫెటిక్ మెడిసిన్
ఏపీలోని 2 ఫేక్ వర్సిటీలు ఇవే
- గుంటూరు లోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ వర్సిటీ
- విశాఖలోని బైబిల్ ఓపెన్ వర్సిటీ ఆఫ్ ఇండియా
దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోని ఫేక్ వర్సిటీల జాబితా ఇదే
- బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ వర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ (కర్ణాటక)
- రాజా అరబిక్ వర్సిటీ (మహారాష్ట్ర)
- శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (పుదుచ్ఛేరి)