Begin typing your search above and press return to search.

ఆ ఒసమా బీర్ టేస్ట్ నచ్చడంతో ...!

UKలోని లింకన్‌షైర్‌లోని బిల్లింగ్‌హేలో ఉన్న ఒక పబ్‌లో తన 'ఒసామా బిన్ లాగర్' బీర్‌ను కొనుగోలు చేయడానికి భారీ రద్దీ ఏర్పడటంతో Michel's Brewing Co తన వెబ్‌సైట్‌ను మూసివేసింది.

By:  Tupaki Desk   |   27 May 2024 11:30 PM GMT
ఆ ఒసమా బీర్ టేస్ట్ నచ్చడంతో ...!
X

కళ్యాణమొచ్చినా కక్కొచ్చిన ఆగదు అన్నట్లు మార్కట్లో జనాలకు ఎక్కువగా ఏదయినా నచ్చిందంటే వెంటబడి సొంతం చేసుకోవాలని ఎగబడతారు. ఇక మందుబాబులు అయితే మామూలుగా ఉండరు. యూకేకు చెందిన ఒక మద్యం దుకాణంలో బీర్ టేస్ట్ నచ్చడంతో దాని కోసం మందుబాబులు ఎగబడ్డారు.

దాన్ని ఆన్ లైన్ లో అయినా ఆర్దర్ చేయాలని ప్రయత్నించడంతో ఏకంగా ఆ సంస్థ వెబ్ సైట్ డౌన్ అయింది. UKలోని లింకన్‌షైర్‌లోని బిల్లింగ్‌హేలో ఉన్న ఒక పబ్‌లో తన 'ఒసామా బిన్ లాగర్' బీర్‌ను కొనుగోలు చేయడానికి భారీ రద్దీ ఏర్పడటంతో Michel's Brewing Co తన వెబ్‌సైట్‌ను మూసివేసింది. విడుదల చేసిన మద్యంలో ఒసామా బిన్ లాజర్ ఎక్కువగా డిమాండ్ చేశారు. సిట్రస్‌ ఫ్లేవర్‌తో కూడిన బీర్‌ను కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. దీంతో.. వైబ్‌సైట్‌కు.. ట్రాఫిక్ పది రెట్లు పెరగడంతో సంస్థ సహ వ్యవస్థాపకులు, ల్యూక్, కేథరీన్ మిచెల్ ఏకంగా తమ ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేశారు.

ఈ మేరకు మిచెల్ మాట్లాడుతూ నా ఫోన్ లో వేల సంఖ్యలో నోటిఫికేషన్లు కనిపిస్తున్నాయి. దీంతో గత 48 గంటలుగా ఫోన్ ముట్టడం లేదు అని చెప్పింది. ఈ బీర్ మగ్ పై 2011లో అమెరికా చేతిలో హతమైన అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ చిత్రం ఉంది. బిల్ లాడెన్ మాత్రమే కాదు, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ పేరు మీదుగా కిమ్ జోంగ్ అలే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరు మీద పుతిన్ పోర్టర్ కూడా ఉన్నారు. బిన్ లాడెన్ పేరు విని కొందరు చిరాకు పడుతున్నారని మిచెల్ వెల్లడించింది. అయితే ఒసామా బిన్ లాగర్ బీర్ కు సంబంధించిన ప్రతి బ్యారెల్ నుండి సెప్టెంబరు 11, 2011న జరిగిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉగ్రవాద దాడి బాధితులకు పది పౌండ్లు విరాళంగా ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.