రష్యాకు ఇది మామూలు దెబ్బ కాదు... 24 గంటల్లో పని పూర్తి చేసిన కీవ్!
రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధం ఇప్పట్లో చల్లబడేలా లేదనే చర్చ ఇటీవల మరింత బలంగా సాగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 17 Dec 2024 10:30 PM GMTరష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధం ఇప్పట్లో చల్లబడేలా లేదనే చర్చ ఇటీవల మరింత బలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. పైగా... మూడో ప్రపంచ యుద్ధం అంటూ వచ్చిందంటే.. అందుకు తొలి ప్రధాన కారణం ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధమే అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో రష్యాకు ఊహించని దెబ్బ తగిలింది.
అవును... ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాదే పైచేయి అని.. ఉక్రెయిన్ ను పసికూనను చేసి రష్యా ఆడుకుంటుందనే కామెంట్లు ఒకప్పుడు వినిపించేవని అంటుండేవారు! అయితే... అమెరికా పరోక్ష మద్దతు కారణంగానో ఏమో కానీ... రష్యాకు ఇటీవల ఉక్రెయిన్ కొత్త కొత్త షాక్ లు ఇస్తుంది. ఈ సమయంలో జరిగిన ఓ మరణం ఆసక్తికర చర్చను తెరపైకి తెచ్చింది.
ఉక్రెయిన్ పై రసాయన ఆయుధాలు ప్రయోగించేలా ఓ రష్యన్ జనరల్ ఆదేశించారంటూ కీవ్ ఆరోపించింది. దీంతో.. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే... అలా ఆరోపించిన 24 గంటల్లోనే అతడిపై తీవ్రమైన బాంబు దాడి జరిగింది. ఆ ఘటనలో ఉక్రెయిన్ ఆరోపించిన జనరల్ ప్రాణాలు కోల్పోయారు. ఆయనే.. ఇగోర్ కిర్లోవ్.
తాజాగా రష్యాలోని మాస్కోపై జరిగిన బాంబు పేలుడు ఘటనలో కీలకమైన న్యూక్లియర్ ప్రిటెక్షన్ ఫోర్స్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ మరణించారు. రష్యాలోని జీవ రసాయన ఆయుధాల రక్షణ ఈయన ఆధీనంలోనే ఉందని అంటారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ భవనం బయట ఆపిన ఎలక్ట్రిక్ స్కూటర్ లో పేలుడు పదార్థాలు అమర్చినట్లు అనుమానిస్తున్నారు. ఆ పేలుడుతో ఇగ్రోర్ తో పాటు ఆయన అసిస్టెంట్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. అయితే.. ఈ పేలుడు జరిగిన ప్రాంతనికి వెళ్లే మార్గం.. రష్యా అధ్యక్ష భవనంకు 7 కి.మీ.దురంలో మొదలవుతుందని అంటున్నారు.
అయితే... జీవ రసాయన ఆయుధాల రక్షణ దళానికి చీఫ్ గా ఉన్న లెఫ్టనెంట్ జనరల్ ఇగోర్ కిరిలోవ్ ను హత్య చేసింది తామేనని ఎస్.బీ.యూ. (సెక్యూరిటీ సర్వీసెస్ ఆఫ్ ఉక్రెయిన్) వెల్లడించింది. ఈ సందర్భంగా స్పందిస్తూ... స్పెషల్ ఆపరేషన్ లో భాగంగా అతడిని అంతం చేశామని వెల్లడించిందని చెబుతున్నారు.