అటు రష్యన్లు, ఇటు ఉక్రెనియన్లు ఆ చిన్న దేశానికే ఎందుకు వెళ్తున్నారు?
అవిరామంగా సాగుతున్న సుదీర్ఘ యుద్ధంతో అత్యంత చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు రష్యా, ఉక్రెయిన్ ప్రజలు.
By: Tupaki Desk | 9 Oct 2024 3:00 AM GMTఅవిరామంగా సాగుతున్న సుదీర్ఘ యుద్ధంతో అత్యంత చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు రష్యా, ఉక్రెయిన్ ప్రజలు. ఈ సమయంలో ఇరు దేశాల ప్రజలు వలసబాటలు పడుతున్నారు. దేశం విడిచి వెళ్లిపోయి తలదాచుకుంటున్నారు. ఈ సమయంలో ఈ రెండు దేశాల ప్రజలకు తలదాచుకొవడానికి ఓ చిన్న దేశం ప్రత్యామ్నాయంగా నిలిచింది.
ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నూంచి ఇరు దేశాల ప్రజలూ ఐరోపాకు వలస వెళ్తున్నారు. ఉక్రెయిన్ నుంచి శరణార్థులే కాదు.. పుతిన్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నవారూ తప్పించుకుని వెళ్తున్నారు. వారందరిదారులూ మాటెనెగ్రో అనే చిన్నదేశం వైపే వెళ్తున్నాయి. ప్రస్తుతానికి ఈ దేశం వలసలను తగ్గుకోగలుగుతోంది.
వాస్తవానికి రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత సుమారు 40 లక్షల మందికి పైగా ఉక్రెయినియన్లు యూరోపియన్ యూనినన్ కు పారిపోయారని అంటున్నారు. ఇందులో చాలా మంది జర్మనీ, పోలాండ్ లకు వెళ్లారు. ఈ సమయంలో సుమారు 2 లక్షల మంది యుక్రెనియన్లను అనుమతించింది మెంటెనేగ్రో.
దీంతో... యూరోపియన్ యూనియన్ వెలుపల యుక్రెనియన్ శరణార్థులను అత్యధిక సంఖ్యలో కలిగి ఉన్న దేశంగా మెంటెనేగ్రో మారింది. ఈ దేశానికి ఇంటర్నల్ గా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ.. శరణార్థుల సంక్షోభాన్ని మాత్రం చక్కగా ఎదుర్కొంటుందని అంటున్నారు. ఇదే సమయంలో రష్యాతో పాటు బెలారస్ నుంచి కూడా వేలాది మంది ఇక్కడకు వచ్చారు.
ముఖ్యంగా యుక్రెయిన్లకు తాత్కాలిక రక్షణ హోదా కల్పించినందుకు ప్రశంసలు అందుకుంటున్న ఈ దేశం.. ఈ హోదాను మార్చి 2025 వరకూ పొడిగించింది. వీసా రహిత ప్రవేశం, ప్రభుత్వ విధానాల కారణంగా చాలామందికి ఈ దేశం ఆకర్షణీయమైన ఎంపికగా మారిందని అంటున్నారు. అయితే ఇక్కడ పౌరసత్వం పొందడం మాత్రం చాలా కష్టం అని అంటున్నారు.