Begin typing your search above and press return to search.

నడి రోడ్డు మీద కాల్పులు జరుపుకున్న ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యే

గ్యాంగ్ వార్ ను తలపించేలా మారిన ఈ ఉదంతానికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. 2022 నుంచి వీరి మధ్య రాజకీయ వైరం తీవ్రంగా ఉంది.

By:  Tupaki Desk   |   28 Jan 2025 6:56 AM GMT
నడి రోడ్డు మీద కాల్పులు జరుపుకున్న ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యే
X

ఇంతకు మించిన బరితెగింపు ఇంకేం ఉంటుంది? ఎంతటి రాజకీయ శత్రుత్వం అయితే మాత్రం.. ఇంతలానా? అంటూ అవాక్కు అవుతున్నారు. ఉత్తరాఖండ్ లోని రూర్కీలో ఒక ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యే నడి రోడ్డు మీద కాల్పులు జురుపుకున్న వైనం సంచలనంగా మారింది. ఖాన్ పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ (ఇండిపెండెంట్), మాజీ ఎమ్మెల్యే బీజేపీకి చెందిన లస్కర్ కన్వర్ ప్రణవ్ సింగ్ లు పిస్టల్ తో కాల్పులు జరుపుకున్నారు.

గ్యాంగ్ వార్ ను తలపించేలా మారిన ఈ ఉదంతానికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. 2022 నుంచి వీరి మధ్య రాజకీయ వైరం తీవ్రంగా ఉంది. ఇటీవల వీరిద్దరూ సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఒకరిపై ఒకరు విమర్శలు.. ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ వివాదం అంతకంతకూ ముదిరి.. కాల్పుల వరకు వెళ్లింది. తనను దూషించారంటూ మాజీ ఎమ్మెల్యే.. అతని అనుచరులు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు. అక్కడ ఘర్షణ పడ్డారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే ఇంటి మీదా.. వారి వర్గం మీదా రాళ్లు విసిరారు. ఆపై కాల్పులు జరిపారు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కుమార్ పోలీసులతో పాటు అక్కడకు చేరుకున్నారు. దీనికి ప్రతిగా ఎమ్మెల్యే అనుచరులు మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి రాళ్లు విసరటంతో పాటు..కాల్పులు జరిపారు.

ఈ ఉదంతంలో పిస్టల్ పట్టుకొచ్చిన ఎమ్మెల్యే రోడ్డు మీదకు ఆవేశంతో రావటంతో.. పోలీసులు ఆయన్ను బలవంతంగా ఆపారు. సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఇద్దరు నేతల్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేకు బెయిల్ లభించగా.. మాజీ ఎమ్మెల్యేకు మాత్రం 14 రోజుల రిమాండ్ కు పంపుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.