పవన్ కు ఉండవల్లి సంచలన లేఖ... పెద్ద టాస్కే ఇచ్చారా?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.
By: Tupaki Desk | 10 Dec 2024 12:32 PM GMTఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ సందర్భంగా తాను ఎంతో కాలంగా చర్చిస్తున్న, పోరాడుతున్న విషయాన్ని ప్రస్థావించారు. ఇందులో భాగంగా... 2014లో విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ధే బాధ్యత పవన్ తీసుకోవాలని లేఖలో కోరారు.
అవును... పవన్ కు ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా... 18-02-2024న రాష్ట్ర విభజన బిల్లుపై ఏ విధమైన చర్చా జరగకుండా.. ఎంతమంది విభజనకు అనుకూలమో, మరెంతమంది వ్యతిరేకమో డివిజన్ ద్వారా తేల్చకుండా తలుపులు మూసేసి రాష్ట్ర విభజన జరిగిందని.. అది మీకు తెలిసిన విషయమే అని ఉండవల్లి మొదలుపెట్టారు.
అనంతరం.. ఈ విషయమై తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పదేళ్లుగా నడుస్తూనే ఉందని.. ఇప్పటి వరకూ కేంద్రం కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదని.. 18-02-2018లో మీచే ఏర్పడిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ.. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన బకాయిల మొత్తం రూ.74,542 కోట్లుగా లెక్కతేల్చిందని పవన్ కు ఉండవల్లి గుర్తు చేశారు.
ఇక, 16-07-2018లో చంద్రబాబుని కలిసిననప్పుడు.. సుప్రీంకోర్టులో రాష్ట్రం తరుపున అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయించారని.. కారణాలేవైనప్పటికీ అవి అమలు కాలేదని.. తన వాదనతో చంద్రబాబు ఏకీభవించినా ముందుకురాలేదని పేర్కొన్నారు! ఇక 2022 నవంబర్ లో సుప్రీంకోర్టులో ఓ అనూహ్యమైన ఘటన జరిగిందని అన్నారు.
ఈ సందర్భంగా... కోర్టుకు హాజరైన అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ... ఇన్నేళ్ల తర్వాత ఈ కేసును విచారించడం అంటే తేనెతుట్టును కదిలించడమే అని.. అందువల్ల ఈ కేసును మూసేయాలని కోరారని కోరారని పవన్ కు రాసిన లేఖలో ఉండవల్లి పేర్కొన్నారు.
అయితే... 23-02-2023లో ఏపీ ప్రభుత్వం అభిషేక్ సింఘ్వీ చేసిన వాదనతో ఏకీభవించకుండా.. ఏపీకి రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన విభజన వల్ల కలిగిన నష్టాన్ని వివరిస్తూ.. నా వాదనను బలపరుస్తూ కౌంటర్ దాఖలు చేసిందని తెలిపారు. ఇలా ఈ పదేళ్లలో జరిగిన పరిణామాలన్నింటినీ ఉండవల్లి వివరించారు.
ఈ సందర్భంగా... "మీరు ఈ విషయమై శ్రద్ధ తీసుకొని.. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ విభజన జరిగిన తీరు, తద్వారా మనకు జరిగిన అన్యాయం విషయమై చర్చకు నోటీసులు ఇప్పించాలని.. సుప్రీంకోర్టులో పెండింగ్ లో పడిపోయిన రాష్ట్ర విభజన అంశాన్ని త్వరితగతిన ఓ కొలిక్కి తీసుకురావాలని కోరుతున్నాను" అంటూ ఉండవల్లి ముగించారు.
మరి... ఉండవల్లి రాసిన లేఖ, అందులో ప్రస్థావించిన "ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ" వ్యవహారం.. తర్వాత మౌనం వహించినట్లు కనిపించడం వంటి విషయాలపై పవన్ స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి!