ఆ ఇద్దరికీ షాకిచ్చిన బాబు... ట్విట్టర్ వేదికగా కత్తి దూస్తున్న శ్రీదేవి!
తనకు టిక్కెట్ దక్కలేదనో.. లేక, మరేదైనా బలమైన కారణం ఉందో తెలియదు కానీ... టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల అనంతరం ఉండవల్లి శ్రీదేవి ఒక ట్వీట్ చేశారు.
By: Tupaki Desk | 22 March 2024 11:20 AM GMTఅనడానికీ, అనుకోవడానికీ.. అది నిజంగా జరగడానికి ఉన్న వ్యత్యాసం చాలా మందికి అనుభవంలోకి వస్తే కానీ తెలియదు!! పైగా రాజకీయాల్లో ఒక్కోసారి తీసుకున్న ఆవేశపూరిత నిర్ణయం దశాబ్ధాలపాటు వెంటాడుతుందనీ చెబుతుంటారు. ఈ క్రమంలో... వైసీపీ నుంచి టీడీపీకి జంప్ అయిన ఇద్దరు నేతల పరిస్థితి అలానే ఉందని అంటున్నారు నెటిజన్లు! దీంతో... తాజాగా చంద్రబాబు మూడో జాబితాను కూడా ప్రకటించడంతో... వీరి పరిస్థితి అటూ ఇటూ కాకుండా పోయిందని కామెంట్ చేస్తున్నారు.
అవును... వైసీపీ నుంచి టీడీపీలో చేరారు నలుగురు వైసీపీ మాజీ నేతలు. ఇందులో భాగంగా... కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాం నారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లు ఫ్యాన్ కింద నుంచి లేచి సైకిల్ ఎక్కేశారు! తీరా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థుల మూడో జాబితాలోనూ ఈ లిస్ట్ లో ఇద్దరి పేర్లు లేవు. పైగా ఇంక అవకాశాలు కూడా లేవని తెలుస్తుంది!
ఈ నలుగురు నేతల్లో ఇప్పటికే ఇద్దరు నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్), ఆనం రాంనారాయణ రెడ్డి (ఆత్మకూరు)కి టీడీపీ టిక్కెట్లు దక్కగా... తాడికొండ టిక్కెట్ ఆశించినట్లు చెబుతున్న ఉండవల్లి శ్రీదేవికి, ఉదయగిరి టిక్కెట్ ఆశించినట్లు చెబుతున్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి టిక్కెట్లు దక్కలేదు! దీంతో ఈ ఇద్దరి నేతల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని అంటున్నారు.
శ్రీదేవి ఘాటు ట్వీటు:
తనకు టిక్కెట్ దక్కలేదనో.. లేక, మరేదైనా బలమైన కారణం ఉందో తెలియదు కానీ... టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల అనంతరం ఉండవల్లి శ్రీదేవి ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారగా.. ఆమెకు కొత్త కదా అలానే ఉంటుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ ఆమె చేసిన ట్వీట్ ఏమిటి.. దీనిపై విశ్లేషకుల అభిప్రాయం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం...!
వాస్తవానికి వైసీపీ నుంచి టీడీపీలో చేరే సమయంలోనే శ్రీదేవి కు చంద్రబాబు టిక్కెట్ ఆఫర్ చేశారని చెబుతారు! ఈ సమయంలో చంద్రబాబుకు ఆమె మూడు ఆప్షన్స్ కూడా ఇచ్చారని అంటుంటారు. ఇందులో భాగంగా ఏమాత్రం అవకాశం ఉన్నా తాడికొండ నియోజకవర్గం కేటాయించాలని.. అలా కానిపక్షంలో... తిరువూరు అసెంబ్లీ.. లేదా, బాపట్ల లోక్ సభ స్థానలకూ తన పేరును పరిశీలించాలని శ్రీదేవి కోరినట్లు కథనాలొచ్చాయి.
తీరా ఈ రోజు వచ్చిన టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాలో ఆ మూడు నియోజకవర్గాలలోనూ వేరేవారికి అవకాశం ఇచ్చేశారు బాబు. దీంతో ఉండవల్లి శ్రీదేవి బాగా హర్ట్ అయ్యారని తెలుస్తుంది. ఇదే సమయంలో... ఇప్పటికి గాని ఆమెకు తత్వం బోధపడలేదనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీదేవి ఒక ట్వీట్ చేశారు. దీంతో... ఆ ట్వీట్ కింద కామెంట్ సెక్షన్ దద్దరిల్లిపోతోంది!
ఈ క్రమంలో శ్రీదేవి చేసిన ట్వీట్ ఈ విధంగా ఉంది... “రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయ్యింది!!” #Bapatla 🗡️"