Begin typing your search above and press return to search.

బాబు... జగన్ లొంగిపోయారు...మాజీ ఎంపీ హాట్ కామెంట్స్

ఆయన రాజమండ్రీలో తాజాగా మాట్లాడుతూ సీఎం జగన్ విపక్ష నేత చంద్రబాబుల మీద హాట్ హాట్ కామెంట్స్ చేశారు

By:  Tupaki Desk   |   31 July 2023 12:09 PM GMT
బాబు... జగన్ లొంగిపోయారు...మాజీ ఎంపీ హాట్ కామెంట్స్
X

ఏపీలో ఒకరు సీఎం, మరొకరు విపక్ష నేత. ఈ ఇద్దరూ రాజకీయంగా దిగ్గజ నేతలే. మరి ఇలాంటి ఇద్దరు నేతలూ లొంగిపోయారు అంటే అది చాలా పెద్ద మాటే. కానీ ఆ మాటను అన్నది ఎవరో కాదు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉండి రెండు సార్లు ఎంపీగా చేసిన మాజీ కాంగ్రెస్ నేత. ప్రస్తుతం రాజకీయ విశ్లేషకునిగా మారిన ఉండవల్లి అరుణ్ కుమార్.

ఆయన రాజమండ్రీలో తాజాగా మాట్లాడుతూ సీఎం జగన్ విపక్ష నేత చంద్రబాబుల మీద హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ ఇద్దరూ కూడా కేంద్రంలోని బీజేపీకి పూర్తిగా లొంగిపోయారని విమర్శించారు. ఏపీకి గత పదేళ్ళుగా కేంద్రంలోని బీజేపీ అన్యాయం చేస్తున్నా కూడా ఈ ఇద్దరు నేతలూ కనీసం నోరు మెదపడంలేదని అన్నారు

విభజన హామీలు ఏ ఒక్కటీ నెరవేరకపోయినా ఏపీకి కేంద్రం అడుగడుగునా అన్యాయం చేసినా కూడా ఇద్దరు నేతలూ ఎందుకు అడగరని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని విపక్షాలు ఇచ్చాయని నిజానికి ఏపీలోని అధికార వైసీపీ విపక్ష టీడీపీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉమ్మడి ఏపీ విభజన 2014లో జరిగినప్పటి నుంచి అంధ్రాకు బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ద్రోహం చేస్తూనే ఉందని ఆయన అన్నరు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చి పదేళ్లు కావస్తున్నా పదేళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఉండవల్లి నిందించారు. ఏపీ బాగు కోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు రెండూ పోరాడడం లేదని ఆయన అన్నారు.

వైసీపీ టీడీపీ రెండూ కూడా కేంద్రంలోని బీజేపీతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాయని ఆయన ఆరోపించారు. కేంద్ర బీజేపీ ఆదేశాలను పాటిస్తున్నాయని కూడా అన్నారు. కేంద్రంతో తలపడి సాధించుకోవాల్సినవి ఉండగా పూర్తిగా సరెండర్ అయిపోయాయని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవి తీసుకున్నా కూడా వైసీపీ టీడీపీ మద్దతు ఇస్తున్నాయని అన్నారు. అది సిటిజన్ చార్టర్ అయినా లేక పంజాబ్ హక్కుల పోరాటం అయినా ఇంకా మరేదైనా కూడా బీజేపీతోనే ఈ పార్టీలు ఉంటున్నాయని ఉండవల్లి ఘాటు విమర్శలు చేశారు.

బీజేపీకి బలం ఉన్న లోక్ సభలోనూ వైసీపీ టీడీపీ మద్దతుగా నిల్వడం అంటే ఏమనుకోవాలి. ఇక రాజ్యసభలో అయితే బీజేపీకే జై కొడుతున్న సన్నివేశం కనిపిస్తోంది అని అన్నారు. ఏపీలో గత పదేళ్ళుగా ఒక్క కొత్త పరిస్రమ రాలేదని, అలాగే ఏపీ అభివృద్ధి ఏమీ జరగలేదని ఉండవల్లి అన్నారు. అయితే రాష్ట్రం వైపు రుతు పవనాలు చల్లగా చూస్తూండడం వల్లనే రాష్ట్ర జీడీపీ పెరుగుతోంది తప్ప మరేమీ ప్రగతి కానే కాదని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ప్రాధమికంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉందని పారిశ్రామిక ప్రగతి కూడా జత కావాల్సి ఉన్నా ఆ దిశగా కేంద్రం కానీ రాష్ట్రం కానీ చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.