Begin typing your search above and press return to search.

ముంబైలో తొలి అండర్ గ్రౌండ్ మెట్రో స్పెషలిటీస్ తెలుసా?

త్వరలో ముంబైలోని మొదటి భూగర్భ మెట్రో త్రీ ప్రాజెక్ట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Sep 2024 9:30 PM GMT
ముంబైలో తొలి అండర్  గ్రౌండ్  మెట్రో స్పెషలిటీస్  తెలుసా?
X

త్వరలో ముంబైలోని మొదటి భూగర్భ మెట్రో త్రీ ప్రాజెక్ట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలలో ప్రధాని నరేంద్ర మోడీ ముంబైలో పర్యటించనున్న నేపథ్యంలో.. ఈ అండర్ గ్రౌండ్ మెట్రో త్రీ ప్రాజెక్టును పాక్షికంగా ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఇది ఆక్వాలేన్ లోని మొదటి దశ.

అరె కాలనీ - బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మధ్య నడుస్తున్న 12 కిమీల మార్గానికి ఇది విస్తరణ కానుంది. ఈ విభాంగంలో 10 స్టేషన్లు పని చేస్తాయి. ప్రస్తుతం అందుతున్న నివేధికల ప్రకారం... థానే క్రీక్ వంతెనలోని ఓ భాగం.. ముంబై నుంచి నాగ్ పూర్ కు అనుసంధానించే సమృద్ధి ఎక్స్ ప్రెస్ వే చివరి దశ ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.

ఈ మార్గంలో మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత సుమారు 2,500 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చని అంచనా వేస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలకు చేరుకునేందుకు ఈ మెట్రో ఎంతో ఉపయుక్తం కానుంది. ఈ ఆక్వా లేన్ దక్షిణ ముంబై, మధ్య పశ్చిమ ప్రాంతాలను కలుపుతుంది.

ఈ కొత్త మెట్రో ముఖ్య వివరాలు!:

దూరం - 12 కిలో మీటర్లు

స్టేషన్లు - 10 (అరె కాలనీ, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మధ్య)

పూర్తి కారిడార్ పొడవు - 33.5 కిలో మీటర్లు

మొత్తం లైన్ పూర్తి అంచనా - 2025 మార్చి నాటికి

మొత్తం స్టేషన్లు - 27

పని వేళలు – వీక్ డేస్ లో ఉదయం 6:30 నుంచి రాత్రి 10:30 వరకూ. వీకెండ్స్ లో ఉదయం 8:30 నుంచి రాత్రి 10:30 వరకూ

రైలు కార్యకలాపాలు: ప్రతీ రోజు 96 ట్రిప్పులు ఉంటాయి. ఎనిమిది కార్ల రైలులో సుమారు 2,500 మంది ప్రయాణించవచ్చని అంచనా.