నెల రోజుల్లో వెయ్యి యూఎఫ్ వోలు
లడఖ్‌లోని భారత్-చైనా సరిహద్దుకు సమీపంలోని కొంగాలా ప్రాంతంలో ఫ్లయింగ్ సాసర్లు చూసినట్లు స్థానికులు చెప్పారు
By: Tupaki Desk | 1 Dec 2023 1:04 PM GMTఅంతరిక్షం నుంచి యూఎఫ్ వోలు లేదా ఎగిరే పళ్లాలు భూమి మీదకు వచ్చాయని, వాటిలో ఏలియన్స్ ఉన్నారని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇక, అమెరికాలోని సెక్టార్ 51లో ఏలియన్లనై పరిశోధనలు కూడా జరుగుతన్నాయని ఎన్నో ఏళ్లుగా పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక, నాసా కూడా ఏలియన్లు, యూఎఫ్ వోల ఉనికిని ధృవీకరించిందని ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా గత నెల రోజుల వ్యవధిలో వేలాది యూఎఫ్ లోలు భూకక్షలో సంచరించాయని యూఎస్ స్పేస్ ఫోర్స్(యూఎస్ఎస్ఎఫ్) వెల్లడించింది.
రోదసీ నుంచి వచ్చే ప్రమాదాలను ముందుగా పసిగట్టేందుకు అమెరికా ఏర్పాటు చేసిన యూఎస్ఎస్ఎప్ వాటి కదలికలు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువయ్యాయని వెల్లడించింది. అంతేకాదు, గురుత్వాకర్షణ శక్తితో సంబంధం లేకుండా హైపర్ సోనిక్ వేగంతో ప్రయాణించడం, హఠాత్తుగా తమ దిశను మార్చుకొని ప్రయాణించగలగడం వాటి ప్రత్యేకత అని పేర్కొంది.
అమెరికాలోనే కాదు, భారత్ లో కూడా పలుమార్లు యూఎఫ్ వోలను కనిపించాయని ప్రచారం జరిగింది.
లడఖ్‌లోని భారత్-చైనా సరిహద్దుకు సమీపంలోని కొంగాలా ప్రాంతంలో ఫ్లయింగ్ సాసర్లు చూసినట్లు స్థానికులు చెప్పారు. వాటితోపాటు గుర్తుతెలియని ఎగిరే వస్తువులను చాలా సంవత్సరాలుగా చూస్తున్నామని స్థానికులు చెప్పారు. ఇక, పూణే సమీపంలో 26,000 అడుగుల ఎత్తులో ఆకుపచ్చ, తెలుపు రంగు యూఎఫ్ వో ఎగురుతున్నట్లు 2014లో ఒక పైలట్ పేర్కొన్నాడు.