కొత్త పెన్షన్ విధానానికి కేంద్రం రెడీ...అప్పటి నుంచే !
కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానం అమలుకు రెడీ అవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది.
By: Tupaki Desk | 27 Jan 2025 12:30 AM GMTకేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానం అమలుకు రెడీ అవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఏప్రిల్ 1 నుంచి దీనిని అమలు చేస్తామని పేర్కొంటూ కేంద్రం ముందుకు వచ్చింది. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ యూనివైడ్ పెన్షన్ స్కీమ్ షార్ట్ ఫార్మ్ లో యూపీఎస్ ని అమలు చేయడానికి సంబంధించి నోటిఫై చేస్తూ కీలక ప్రకటన జారీ చేసింది. పాత పెన్షన్ విధానం అలాగే నేషనల్ పెన్షన్ సిస్టంలోని పలు లాభదాయకమైన అంశాలను తీసుకుని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ని కేంద్రం రూపకల్పన చేసింది. దీని ప్రకారం చూస్తే కనుక కొన్ని నిబంధనలను రూపొందించారు.
పాతికేళ్ళ సర్వీసు ఉద్యోగి కలిగి ఉండాలి. అపుడు వారు పదవీ విరమణ చేయబోయే లాస్ట్ ఏడాది పన్నెండు నెలల కనీసం వేతనంలో సగానికి సగం పెన్షన్ గా లభిస్తుంది. ఇక పదేళ్ళ సర్వీస్ తప్పనిసరిగా ఈ స్కీం లో పెన్షన్ కి నిబంధన విధించారు. అలా ఉంటేనే పెన్షన్ దక్కుతుంది.
అలా పది నుంచి పాతికేళ్ళ మధ్య సర్వీస్ ఉంటే కనుక వారికి నెలకు పది వేల రూపాయలు దాకా ఫిక్స్ చేసిన మొత్తాన్ని పెన్షన్ గా అందిస్తారు. ఈ స్కీం లో పెన్షనర్ మరణిస్తే ఆయనకు వచ్చే పెన్షన్ లో అరవై శాతం ఆయన భార్యకు జీవితాంతం ఇస్తారు.
ఇక యూపీఎస్ లో ఉన్న నిబంధనల ప్రకారం చూస్తే కరువు భత్యం పెన్షనర్ కి ఆయన మరణానంతరం కుటుంబ పెన్షన్ గా మారితే భార్య లభిస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాత పెన్షన్ స్కీమ్ నే అమలు చేయమని అంటున్నారు. గతంలో దాని ప్లేస్ లో తీసుకుని వచ్చిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ ని వారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
దాంతో మధ్యే వాదంగా దీనిని కేంద్రం తెచ్చింది. ఇక నేషనల్ పెన్షన్ సిస్టమ్ యూపీస్ లలో ఏదో ఒక దానిని ఉద్యోగులు తమకు నచ్చిన తీరున ఎంపిక చేసుకోవచ్చు అని ఆప్షన్ ఇచ్చారు. మరి ఈ పెన్షన్ అమలుతో కేంద్రం రాష్ట్రాలకు కూడా ఒక కీలకమైన సందేశాన్ని ఇచ్చినట్లు అయింది. రాష్ట్రాలలో కూడా పాత పెన్షన్ అమలు చేయమని డిమాండ్లు ఉన్నాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ తో పాటు ఆర్ధిక నిపుణుల నుంచి హెచ్చరికలూ ఉన్నాయి. పాత పెన్షన్ విధానం ఖజానాకు పెను భారమని కూడా అంటున్నారు.
దాంతో చాలా రాష్ట్రాలు కొత్త పెన్షన్ విధానం అమలు చేయాలని చూస్తున్నాయి. ఏపీ లాంటి చోట్ల అయితే సీపీఎస్ ని రద్దు చేయాలని పాత పెన్షన్ అమలు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ఎవరూ పాత పెన్షన్ విధానం అమలు చేయలేరు. దాంతో కొత్త పెన్షన్ దిశగా ఉద్యోగులను ఎలా ఒప్పించాలన్నది ఒక సవాల్ గా ఉంది. కేంద్రం అమలు చేయబోయే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ని చూసి రాష్ట్రాలు తమకు అనుకూలంగా పెన్షన్ విధానంలో మార్పు తెచ్చి ఉద్యోగులను ఒప్పిస్తాయేమో చూడాల్సి ఉంది.