Begin typing your search above and press return to search.

శీతాకాల సమావేశాల్లో వేడి పుట్టించేలా జమిలి బిల్లు ?

కేంద్రంలో బీజేపీ పట్టుదలగా ఉంటుంది తనదైన అజెండా విషయంలో ఆ అజెండాలో అతి కీలకమైనది జమిలి ఎన్నికలు.

By:  Tupaki Desk   |   16 Oct 2024 3:39 AM GMT
శీతాకాల సమావేశాల్లో వేడి పుట్టించేలా  జమిలి బిల్లు ?
X

కేంద్రంలో బీజేపీ పట్టుదలగా ఉంటుంది తనదైన అజెండా విషయంలో ఆ అజెండాలో అతి కీలకమైనది జమిలి ఎన్నికలు. దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్ సభకు పార్లమెంట్ కి ఎన్నికలు జరిపించేసి జాతీయ పార్టీ భావజాలంతో అటు లోక్ సభను ఇటు అసెంబ్లీలను గెలుచుకోవాలన్నది కమలం పార్టీ మాస్టర్ ప్లాన్.

దాని కోసం 2023 లో మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి జమిలి ఎన్నికల మీద పార్టీల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి మూడవసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక కోవింద్ నాయకత్వంలో జమిలి ఎన్నికల మీద నివేదికను పూర్తి చేసి పెద్దలకు ఇచ్చారు.

ఇపుడు అంతా కేంద్రంలోని బీజేపీ పెద్దల మీద పని భారం ఉంది. జమిలి ఎన్నికలను మరో మూడేళ్ల వ్యవధిలో జరిపించాలని కేంద్రం చూస్తోంది. దానికి అనుగుణంగా పావులు కదుపుతోంది. జమిలి ఎన్నికల కోసం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి నెగ్గించుకోవాలి.

దాంతో వీలైనంత తొందరలోనే కేబినెట్ మీటింగ్ పెట్టి జమిలి ఎన్నికల డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం తెలుపుతారు అని అంటున్నారు. ఆ మీదట దానికి లా డిపార్ట్మెంట్ కి పంపించి బిల్లు రూపంలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు అని అంటున్నారు

ఆ విధంగా ఈ కసరత్తుని అంతా పూర్తి చేసుకుని బిల్లు పార్లమెంట్ ముందుకు ఈ శీతాకాలం సమావేశాల్లో రావచ్చు అని ఢిల్లీ వర్గాల భోగట్టాగా ఉంది. వీలైనంత మేరకు బిల్లుని చట్టంగా చేసుకుంటే దానిని బట్టి తమకు అనుగుణంగా జమిలి ఎన్నికల కోసం ఒక రోడ్ మ్యాప్ ని బీజేపీ తయారు చేసుకోవచ్చు అని అంటున్నారు.

ఇక ఢిల్లీ సర్కిల్స్ లో వినిపిస్తున్న మరో విషయం ఏంటి అంటే జమిలి ఎన్నికలు 2027 నవంబర్ కానీ డిసెంబర్ కానీ జరుగుతాయని. అంటే ఇప్పటికి కచ్చితంగా మూడేళ్ల వ్యవధిలో అన్న మాట. షెడ్యూల్ ప్రకారం 2029 మే లో ఎన్నికలు జరగాలి. కానీ దానిని ఏణ్ణర్థం ముందుకు తీసుకుని వస్తారు అన్న మాట.

అందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు అని అంటున్నారు. జమిలి ఎన్నికలు జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకే లాభం అని విశ్లేషణలు ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ సహా ఇండియా కూటమి సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం తన రాజకీయ లాభాన్ని ఎందుకు వదులుకుంటుంది అని అంటున్నారు.

పైగా అధికారంలో ఉండగానే అన్నీ చక్కబెట్టుకోవాలని చూస్తోంది అని చెబుతున్నారు. రాష్ట్ర సమస్యలు కానీ లోకల్ ఇమేజ్ కానీ ఎక్కడా ప్రజల మీద పడకుండా అంతా జాతీయ ప్రభావం చేస్తూ బీజేపీ జమిలి ఎన్నికల్లో గణనీయంగా లాభాలను అందుకోవాలని చూస్తుంది.

జమిలి ఎన్నికలు అంటే ఒక విధంగా ప్రాంతీయ పార్టీల పుట్టె మునిగినట్లే అని అంటున్నారు. అయితే ఏపీలో ఉన్న టీడీపీ జనసేన ఎన్డీయేతో ఉంటాయి కాబట్టి వాటికి అంత పెద్దగా బెంగ అవసరం లేదు అని అంటున్నారు. ఇక వైసీపీ ఒంటరి పోరుకు దిగితే మాత్రం ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఇక జమిలి ఎన్నికలు ప్రాంతీయ పార్టీలకు అందునా ఏపీలోని పార్టీలకు అతి పెద్ద సవాల్ గానే మారబోతున్నాయని అంటున్నారు.