ప్రధాని పీఠం వైపుగా గడ్కరీ అడుగులు ?
కేంద్రంలో కీలక మార్పులు సంభవిస్తాయా. పదేళ్లుగా తిరుగులేని రాజ్యం చేస్తున్న నరేంద్ర మోడీ వారసుడి నీడలా ఆయన వెంటనే ఉన్నారా
By: Tupaki Desk | 4 Oct 2024 4:01 AM GMTకేంద్రంలో కీలక మార్పులు సంభవిస్తాయా. పదేళ్లుగా తిరుగులేని రాజ్యం చేస్తున్న నరేంద్ర మోడీ వారసుడి నీడలా ఆయన వెంటనే ఉన్నారా. ఈ ప్రశ్నలను బదులు కాలమే చెబుతుంది అని అంటున్నారు. మోడీ వెంట ఉన్నది కేంద్రంలోనూ పార్టీలోనూ కీలకంగా ఉన్నది ఎవరో అందరికీ తెలుసు. ఆయనే అమిత్ షా.
అయితే ఆయన కాకుండా మరో నాయకుడు నీడలాగానే ఉన్నారు. ఆయనే మహారాష్ట్రకు చెందిన నేత నితిన్ గడ్కరీ. ఆయన 2010 ప్రాంతంలోనే బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం ఆయనది.
కేంద్ర మంత్రిగా గత పదేళ్ళుగా కేంద్రంలో పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల తరువాత ఆయనకే ప్రధాని చాన్స్ దక్కుతుందని అంతా అంచనా వేశారు అని ప్రచారం సాగింది. కానీ మోడీ అమిత్ షా ద్వయం వేసిన ఎత్తులకు ఆయన చిత్తు అయ్యారని చెబుతారు.
ఏపీ నుంచి చంద్రబాబు బీహార్ నుంచి నితీష్ కుమార్ మద్దతుని పొందడంతో మోడీ సాధించిన విజయం ఆయనకు మూడోసారి ప్రధాని పీఠాన్ని దక్కించింది అని అంటున్నారు. ఇదిలా ఉంటే గడ్కరీ ఇటీవల కాలంలో తన ఆలోచనలను బయట పెట్టుకుంటున్నారు. తనకు ప్రధాని చాన్స్ వచ్చినా విలువలకు కట్టుబడి నో చెప్పాను అని ప్రతిపక్షాలు తనకు సహకరిస్తామని చెప్పినా తాను రాజకీయ విలువలు కలిగిన నేతగా నో చెప్పాను అని కూడా తెలిపారు.
ఇలా తరచుగా ప్రధాని పదవి మీద నితిన్ గడ్కరీ మాట్లాడడం ఎండీయే లోపలా బయటా చర్చగా మారింది. నితిన్ గడ్కరీ అంత నిబ్బరంగా ఈ మాటలు చెబుతున్నారు అంటే ఆయన వ్యూహం ఏమిటి వెనక ఎవరు ఉన్నారు అన్న చర్చ కూడా ఉంది. అయితే ఆయంకు నిండుగా ఆరెస్సెస్ దీవెనలు ఉన్నాయని అంటున్నారు. అందుకే ఆయన ఈ విధంగా ధాటీగా మాట్లాడుతున్నారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే నితిన్ గడ్కరీని తన పని తాను చేసుకోమని ఆరెస్సెస్ రోడ్ మ్యాప్ ఇచ్చింది అని కూడా ప్రచారం సాగుతోంది. బీజేపీలో వరిష్ట నేత ఎల్ కే అద్వానీ, అలాగే సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీలను పార్టీ నుంది దూరం పెట్టేందుకు 75 ఏళ్ల వయోపరిమితిని మోడీ ప్రధాని అయ్యాక తెచ్చారు.
ఇపుడు అదే 75 ఏళ్ళ కాల పరిమితిని మోడీకే చూపించి ఆయనను తప్పుకోమని ఆరెస్సెస్ కోరే చాన్స్ ఉంది అని అంటున్నారు. 2025 సెప్టెంబర్ 17 నాటికి మోడీకి 75 ఏళ్ళు పూర్తిగా నిండిపోతాయి. దాంతో ఆయన ఆ తరువాత మాజీ ప్రధాని అవుతారా అన్న చర్చ కూడా సాగుతోంది
దానికి దారి తీసే రాజకీయ పరిస్థితులు కూడా ఉంటాయని అంటున్నారు. అక్టోబర్ 8న కాశ్మీర్, హర్యానా అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఈ రెండు చోట్లా బీజేపీకి ఆశలు లేవు అని అంటున్నారు. ఆ తరువాత జార్ఖండ్, మహారాష్ట్రలలో కూడా బీజేపీకి ఓటమి తప్పదని చెబుతున్నారు. ఇక ఢిల్లీ, బీహార్ లలో కనుక బీజేపీ ఓటమి పాలు అయితే మోడీ గ్లామర్ పట్ల సొంత పార్టీలోనే డౌట్లు వస్తాయని, దానికి తోడు మిత్రులలోనూ ప్రతిపక్షాలలోనూ కూడా మోడీ టార్గెట్ అవుతారని అంటున్నారు
ఆ విధంగా బీజేపీ లో మోడీకి వ్యతిరేకత మొదలైతే కనుక ఆల్టర్నేషన్ గా గడ్కరీని సిద్ధంగా ఆరెస్సెస్ ఉంచింది అని అంటున్నారు. బీజేపీ ఇపుడు గడ్కరీ తో పాటు యూపీ సీఎం యోగీని కూడా లైన్ లో పెట్టింది అని అంటున్నారు. మోడీ వల్ల బీజేపీ ఒక వెలుగు వెలిగింది. ఆయన ఇమేజ్ తగ్గిపోతున్న వేళ బీజేపీని కాపాడుకునే వ్యూహంలో భాగమే ఇదని అంటున్నారు. ఏది ఏమైనా మోడీకి రానున్న రోజులు రాజకీయంగా ఇబ్బందికరమే అవుతాయని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో.