Begin typing your search above and press return to search.

బడ్జెట్ ముందు.. బడ్జెట్ తర్వాత.. గోల్డ్ ఎంత చేంజ్..?

అయితే.. ఇదంతా తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫలితమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగారం రూ. 70వేల దిగువకు చేరింది!

By:  Tupaki Desk   |   25 July 2024 9:49 AM GMT
బడ్జెట్  ముందు.. బడ్జెట్  తర్వాత.. గోల్డ్  ఎంత చేంజ్..?
X

ఒకానొక సమయంలో తులం బంగారం రూ.80 వేలు దాటి రూ.లక్షకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాల అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఇలా మొన్నటివరకూ ఆకాశాన్నంటిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అయితే.. ఇదంతా తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫలితమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగారం రూ. 70వేల దిగువకు చేరింది!

అవును... నిన్నమొన్నటివరకూ సామాన్యులు కొనుగోలు చేయలేని స్థాయికి చేరుకుంటున్నట్లు పెరిగిన బంగారం ధర.. ప్రస్తుతం దిగొస్తుంది. కేంద్రం బద్జెట్ ఎఫెక్ట్ దీనిపై బలంగా పనిచేస్తుందని అంటున్నారు. గురువారం నమోదైన వివరాల ప్రకారం... 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1,040 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.950 తగ్గింది.

గురువారం ఉదయం నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ వివరాల ప్రకారం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంధర రూ.64,000 కాగా.. 24క్యారెట్ల బంగారం ధర రూ.69,820 గా ఉంది. మరోవైపు వెండి ధర సైతం భారిగ తగ్గుతూ వస్తోంది. ఇందులో భాగంగా... కిలో వెండి రూ.3వేలు తగ్గింది!

ఇక దేశరాజధాని ఢిల్లీ విషయానికొస్తే.. అక్కడ 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,150 కాగా.. .24 క్యారెట్ల బంగారం రూ.69,950 గా ఉంది. ఇదే క్రమంలో... ముంబై, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.64,000 గా ఉండగా... 24 క్యారెట్ల ధర రూ.70,150కి చేరింది.

కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించడమే ఇందుకు కారణం కాగా.. దీని ఫలితంగా మూడు రోజులుగా బంగారం ధర తగ్గుతూనే ఉంది. దీంతో... బంగారం కొనడానికి ఇదే సమరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు!!