Begin typing your search above and press return to search.

ఇక్కడ జాబ్ కావాలంటే కచ్చితంగా మతిమరుపు ఉండాలి!

అవును... జపాన్ లోని టోక్యోలో "రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్" గా పిలవబడే ప్రత్యేకమైన హోటల్ ఉంది!

By:  Tupaki Desk   |   20 Nov 2024 6:05 AM GMT
ఇక్కడ జాబ్ కావాలంటే కచ్చితంగా మతిమరుపు ఉండాలి!
X

సాధారణంగా ఎవరైన రెస్టారెంట్ కి వెళ్లి ఆర్డర్ చేస్తే.. అది కరెక్ట్ గా రాకపోతే వెయిటర్ పై ఫైర్ అయిపోతుంటారు. ఆకలితో కూడిన ఆగ్రహంతో అసహనం ప్రదర్శిస్తుంటారు. కానీ... ఇప్పుడు చెప్పబోయే రెస్టారెంట్ విభిన్నమైంది. ఇక్కడ చెప్పిన అర్డర్ చెప్పినట్లు వస్తుందనే గ్యారెంటీ లేదు. అయినా కూడా కస్టమర్ కి కోపం రాదు. ఈ రెస్టారెంట్ లకు ఆధరణ కూడా బాగా పెరుగుతుందంట.

అవును... జపాన్ లోని టోక్యోలో "రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్" గా పిలవబడే ప్రత్యేకమైన హోటల్ ఉంది! ఇక్కడ ఆర్డర్లు, డెలివరీలలో లోపాలను ఉద్దేశపూర్వకంగా అనుమతిస్తుంది. కారణం... ఇక్కడ వెయిట్ స్టాఫ్ అంతా వివిధ స్థాయిలలో మతిపరుపు ఉన్న వ్యక్తులు. 2025 నాటికి జపాన్ లోని ప్రతీ ఐదుగురిలో ఒకరికి మతిపరుపు ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అయితే ఈ రెస్టారెంట్ ప్రారంభించడానికి పూర్తి కారణం అదే కాకపోయినా.. ఇప్పటికే ఆ సమస్య ఉన్నవారికి మాత్రమే ఇక్కడ వెయిటర్స్ గా ఉద్యోగాలు దొరుకుతాయి. ఈ "రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకన్ ఆర్డర్స్" అనేది జపాన్ టెలివిజన్ డైరెక్టర్ షిరో ఓగుని ఆలోచన. ఈయన వృద్ధాప్యాన్ని ఎలా చూస్తారో.. అది తెచ్చే సమస్యల గురించీ పునరాలోచించాలనుకుని ఈ ఆలోచన చేసినట్లు చెబుతారు.

ఈ రెస్టారెంట్లకు వెళ్లాలనుకునేవారికి టెరంస్ అండ్ కండిషన్స్ పై ఒక క్లారిటీ కూడా ఇవ్వబడిందని అంటున్నారు. ఇందులో భాగంగా.. వెయిటర్లు ఆర్డర్లను తప్పుగా గుర్తుంచుకోవచ్చు.. ఊహించని విధంగా వాటిని అందించొచ్చు.. కొన్ని సందర్భాల్లో కస్టమర్ లతో కలిసి వెయిటర్లు భోజనం కోసం కూర్చోవచ్చు.. దీన్ని తప్పుగా తీసుకోవద్దు.. హృదయపూర్వకంగా స్వీకరించడం అని చెబుతారంట.

ఇక.. ఈ మిస్టేకెన్ ఆర్డర్ ల రెస్టారెంట్ మొదటి ఈవెంట్ 2017లో ప్రారంభమైంది. అప్పటి నూంచి క్రమం తప్పకుండా పలు వేదికలలో నిర్వహించబడుతుంది. ఇది తొలుత క్రౌడ్ ఫండింగ్ తోనే ప్రారంభమైంది. వెబ్ సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా దాతల దాతృత్వంపై ఆధారపడటం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇలాంటివి 8వేల కేఫ్ లకు పెరిగాయని చెబుతున్నారు.