యూఎస్ ని వణికించిన భూకంపాలు... యూ.ఎస్.జీ.ఎస్. షాకింగ్ అంచనాలు!
కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాల్లో కేవలం 12 గంటల వ్యవధిలో సుమారు 57 భూకంపాలు సంభవించాయి.
By: Tupaki Desk | 8 Aug 2024 5:42 AM GMTకాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాల్లో కేవలం 12 గంటల వ్యవధిలో సుమారు 57 భూకంపాలు సంభవించాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూ.ఎస్.జీ.ఎస్.) వెల్లడించిన వివరాల ప్రకారం... మంగళవారం సాయంత్రం 5.2 తీవ్రతతో భూకంప కేంద్రం కెర్న్ కౌంటీని 20 మైళ్ల దూరంలో ఈ భూకంపాలు సంభవించింది.
ఇదే సమయంలో బుధవారం మధ్యాహ్నం 12:10 గంటల ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. ఇదే సమయంలో లామోంట్ కు నైరుతి దిశలో 14 మైళ్ల దూరంలో ఉదయం 9:09 గంతలకు భూమి కంపించింది. ఈ నేపథ్యంలో వచ్చే వారం రోజుల్లో 5 కంటే ఎక్కువ తీవ్రతతో మరికొన్ని భూకంపాలు సంభవించే అవకాశం ఉందని ఏజెన్సీ వెల్లడించింది.
అయితే మంగళవారం కాలిఫోర్నియాను తాకిన భూకంపం ఈ ఏడాదిలో ఇప్పటివరకూ సంభవించిన అత్యంత బలమైనదిగా చెబుతున్నారు. గత ఏడాది 2023 మే 12న కాన్వోండం సమీపంలో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే తాజాగా భూకంపాల వల్ల నిర్మాణాలకు జరిగిన ప్రమాదాలకు సంబంధించి ప్రాథమిక నివేదికలు ఇంకా వెలువడలేదు!
ఈ భూకంప తీవ్రత వెంచూరా, కమరిల్లో, సిమీ వ్యాలీ, ఎన్సినో, శాంటా క్లారిటా, హాలీవుద్, నార్త్ హాలీవుడ్, వుడ్ ల్యాండ్ హిల్స్ ప్రాంతాల్లోని కనిపించినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా లాజ్ ఫెలిజ్ లోని ఓ నివాసి 45 సెకన్ల వ్యవధిలో మూడు సార్లు భూమి కంపించినట్లు వెల్లడించారు. అందులో ఒకటి కాస్త బలమైనది కాగా.. రెండు స్వల్పమైనవని తెలిపారు.
యూ.ఎస్.జీ.ఎస్. అంచనా ప్రకరం.. రాబోయే మూడు దశాబ్ధాల్లో లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో 7 పాయింట్ల తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం 46 శాతం ఉందని, బే ఏరియాలో 51 శాతం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో 7.5 తీవ్రతతో రాబోయే ముప్పై ఏళ్లలో శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతంలో భూకంపం సంభవించే అవకాశం 20% ఉందని అంచనా వేస్తున్నారు.