Begin typing your search above and press return to search.

రైస్ బ్యాన్ తర్వాత అమెరికాలో మరో నిషేధం?

ఇటీవల అమెరికాలో బియ్యం ఎగుమతి నిషేధం అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజంలో చాలా భయాందోళనలకు కారణమైన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   26 Aug 2023 6:22 AM GMT
రైస్ బ్యాన్ తర్వాత అమెరికాలో మరో నిషేధం?
X

ఇటీవల అమెరికాలో బియ్యం ఎగుమతి నిషేధం అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజంలో చాలా భయాందోళనలకు కారణమైన సంగతి తెలిసిందే. అప్పట్లో రైస్ బ్యాగ్ ల కోసం సూపర్ మార్కెట్ల ముందు, బియ్యం దుకాణాల ముందు భారతీయులు క్యూలు కట్టారు. ఈ సమయంలో మరో నిషేధం అంటూ కథనాలు వస్తున్నాయి.

అవును... ఈ ఏడాది అక్టోబరు నుంచి ప్రారంభమయ్యే 2023-24 చక్కెర సీజన్‌ లో చక్కెర ఎగుమతులను నిషేధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. అత్యధికంగా చెరకు పండించే మహారాష్ట్ర, కర్ణాటకలలో రుతుపవనాల వర్షాలు సగటు కంటే 50 శాతం తక్కువగా కురవడంతో చెరకు దిగుబడి తగ్గింది.

దీంతో... ఆహార ద్రవ్యోల్బణంపై భారతదేశం ఆందోళన చెందుతోంది. రిటైల్ ద్రవ్యోల్బణం జులై నెలలో 15 నెలల గరిష్ట స్థాయి 7.4 శాతానికి చేరుకుంది. ఆహార ద్రవ్యోల్బణం 11.5 శాతానికి చేరుకుంది. ఇది మూడేళ్లలో అత్యధికం.

వాస్తవానికి దక్షిణాసియా దేశాల నుంచే ప్రపంచం అంతా చెక్కెర ఎగుమతులు జరుగుతుంటాయి. అయితే భారత్ వంటి దేశంలో అసమానమైన వర్షపాతం నమోదు కావడం వంటివి చెరుకు పంట దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీంతో చెరుకు దిగుబడి బాగా తగ్గింది. ఇదే చక్కెర ఎగుమతిపై నిషేధం విధించాలని నిర్ణయించుకోవడానికి కారణంగా ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

అయితే చక్కెర ఎగుమతి నిషేధానికి సంబంధించిన కథనాలు భయాందోళనలను ఉపయోగించుకునే మరొక ప్రయత్నం అని కొందరు ఊహించినప్పటికీ.. ప్రత్యేకించి అమెరికా వంటి దేశాల్లో భారతీయులు తరచుగా భారతీయ బ్రాండ్ చక్కెరను ఉపయోగించరని అంటున్నారు.

ఫలితంగా... బియ్యం నిషేధంతో పోలిస్తే అమెరికాలోని భారతీయులపై దాని ప్రభావం తక్కువగా ఉంటుందని అంటున్నారు!