Begin typing your search above and press return to search.

పార్శిల్ లో సగం డెడ్ బాడీ... వెస్ట్ గోదావరిలో షాకింగ్ ఘటన!

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, ఉండి మండలం, యండగండి గ్రామంలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   20 Dec 2024 6:48 AM GMT
పార్శిల్ లో సగం డెడ్ బాడీ... వెస్ట్ గోదావరిలో షాకింగ్ ఘటన!
X

ఇంటికి రావాల్సిన విద్యుత్ సామాగ్రి పార్శిల్ లో మృతదేహం ఉంటే.. అసలు డెడ్ బాడీని పార్శిల్ చేసి డెలివరీ చేస్తే ఆ ఘటన ఊహించుకోవడానికే షాకింగ్ గా ఉంటుందని అని అంటే... ఇక అది అక్స్ పీరియన్స్ చేసినవారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ క్రమంలో తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో అలాంటి ఘటన చోటు చేసుకుంది.

అవును... ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, ఉండి మండలం, యండగండి గ్రామంలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఇంటి నిర్మాణం కోసం ఎలక్ట్రికల్ మెటీరియల్ తో రావాల్సిన పార్శిల్ లో మృతదేహం వచ్చింది. అందులో ఓ బెదిరింపు లేఖ కూడా ఉందని అంటున్నారు. దీంతో... ఒక్కసారిగా ఈ విషయం షాకింగ్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... ఉండి మండలంలోని యండగండి గ్రామంలో సాగి తులసి అనే మహిళకు ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం మంజూరైందంట. దీంతో.. ఆ స్థలంలో ఆమె ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఈ సమయంలో ఇంటి నిర్మాణం నిమిత్తం ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి తులసి దరఖాస్తు చేసుకున్నారు.

దీంతో... స్పందించిన క్షత్రియ సేవా సమితి తొలి విడతలో భాగంగా టైల్స్ అందజేశారు. ఈ క్రమంలో ఆమె మరోసారి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సమయంలో విద్యుత్ సామాగ్రి కోసం ఆమె చూస్తున్నట్లు చెబుతున్నారు. అయితే... తాజాగా వారికి ఓ పార్శిల్ రాగా... అందులో వారు ఊహించినట్లు విద్యుత్ సామాగ్రి కాకుండా మృతదేహం వచ్చింది.

ఇదే సమయంలో ఆ పార్శిల్ లో మృతదేహంతోపాటు ఓ లేఖ కూడా ఉన్నట్లు గుర్తించినట్లు చెబుతున్నారు. అందులో... రూ.1.30 కోట్లు చెల్లించాలని, అలాకానిపక్షంలో ఇబ్బందులు ఎదుర్కోంటారని రాసి ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో... ఆందోళనకు గురైన మహిళ తులసి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పార్శిల్ పెట్టేలో ఉన్న మృతదేహం 45 ఏళ్ల మగ వ్యక్తిదిగా గుర్తించినట్లు చెబూతున్నారు. ఇదే సమయంలో ఆ పార్శిల్ లో మృతదేహం సగ భాగం మాత్రమే ఉన్నట్లు గుర్తించారని అంటున్నారు.