Begin typing your search above and press return to search.

దేవుడా ఇదేం పోయే కాలం? మహిళల పుణ్య స్నానాలు వీడియోలు

దారుణాల్లోకెల్లా దారుణంగా ఈ ఉదంతాన్ని చెప్పాలి. ఆధ్యాత్మిక చింతనతో పుణ్యస్నానాల్ని దరిద్రపుగొట్టు చూపుతో చూడటమే కాదు.. వాటిని వీడియోలుగా మలవటమే ఒక దుర్మార్గమైతే.. అలాంటి వీడియోలను అమ్మకాలకు పెట్టిన కామ సైకోలను ఏం చేయాలి?

By:  Tupaki Desk   |   21 Feb 2025 6:15 AM GMT
దేవుడా ఇదేం పోయే కాలం? మహిళల పుణ్య స్నానాలు వీడియోలు
X

దారుణాల్లోకెల్లా దారుణంగా ఈ ఉదంతాన్ని చెప్పాలి. ఆధ్యాత్మిక చింతనతో పుణ్యస్నానాల్ని దరిద్రపుగొట్టు చూపుతో చూడటమే కాదు.. వాటిని వీడియోలుగా మలవటమే ఒక దుర్మార్గమైతే.. అలాంటి వీడియోలను అమ్మకాలకు పెట్టిన కామ సైకోలను ఏం చేయాలి? వారి విషయంలో ఎలా వ్యవహరించాలి?

గడిచిన కొన్ని వారాలుగా ప్రయాగ్ రాజ్ లో సాగుతున్న మహాకుంభమేళాకు కోట్లాది మంది ప్రజలు హాజరు కావటం.. పుణ్యస్నానాల్ని ఆచరించటం తెలిసిందే. అయితే.. స్నానాలు చేసే మహిళా భక్తుల వీడియోలను తీసి.. వాటిని అమ్మకానికి పెట్టిన సైకోను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఇప్పటివరకు దీనికి సంబంధించిన 103 సోషల్ మీడియా ఖాతాల్ని గుర్తించినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

కుంభమేళాలో మహిళలు స్నానాలు చేయటం.. వస్త్రాల్ని మార్చుకునే వేళలో వీడియోలు తీసి.. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్న వైనాన్ని ఉత్తరప్రదేశ్ సోషల్ మీడియా మానిటరింగ్ టీం గుర్తించింది. అంతేకాదు.. ఈ ఛండాలపు వీడియోల్ని అప్ లోడ్ చేస్తున్న వారిని గుర్తించింది. వీటికి సంబంధించిన ఎఫ్ఐఆర్ లను నమోదు చేసిన పోలీసులు.. కొందరిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ తరహా వీడియోలను కొనేవారిని.... అమ్మే వారిని అరెస్టు చేస్తామని.. దీనికి సంబంధించిన తమ సోషల్ మీడియా మానిటరింగ్ టీం ఎల్లవేళలా డేగకన్ను వేసినట్లుగా ప్రకటించారు. మహాకుంభ మేళాలో మహిళల వీడియోలు తీస్తున్న దుండగులు వాటిని రూ.2 వేల నుంచి రూ.3 వేల చొప్పున అమ్ముతున్న వైనాన్ని గుర్తించారు. ఇలాంటి సైకోల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని యూపీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.