వీడొక అసభ్య అంబులెన్స్ డ్రైవర్.. ఏకంగా రోగి భార్యనే..!
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాకు చెందిన ఒక వివాహిత తన భర్త అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఘాజీపూర్ లోని ఒక ఆస్పత్రిలో చేర్పించింది.
By: Tupaki Desk | 5 Sep 2024 7:30 PM GMTఅంబులెన్స్ వచ్చిందంటే ప్రాణాలు నిలబడినట్టే లెక్క. ప్రాణాలు కాపాడటంలో అంబులెన్స్ ప్రాధాన్యత ఎంతో. అలాంటి అంబులెన్స్ డ్రైవర్ చేసిన పాడుపనితో ఒక రోగి ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాకుండా తన సహాయకుడితో కలిసి ఆ రోగి భార్యను లైంగికంగా వేధించాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లో కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాకు చెందిన ఒక వివాహిత తన భర్త అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఘాజీపూర్ లోని ఒక ఆస్పత్రిలో చేర్పించింది. అయితే అక్కడ ఖర్చు తట్టుకోలేక తన భర్తను ఇంటికి తీసుకుపోతానని వైద్యులను అభ్యర్థించింది. తన భర్తకు ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం ఉండటంతో ఒక అంబులెన్సును ఏర్పాటు చేయాలని కోరగా వారు ఒక అంబులెన్స్ డ్రైవర్ నంబర్ ను ఆమెకు ఇచ్చారు.
ఈ క్రమంలో రాత్రిపూట ఆమె అంబులెన్సులో బయలుదేరింది. ఈ క్రమంలో ఆమెను ముందు సీట్లో తన పక్కన కూర్చోవాలని డ్రైవర్ సూచించాడు. ఇలా అయితే పోలీసులు ఆపరని చెప్పాడు. దీంతో సరేనని ఆమె ముందు సీట్లో కూర్చుంది. వెనుక సీట్లో ఆక్సిజన్ పెట్టిన తన భర్త, ఆమె మరిది కూర్చున్నారు.
ఈ క్రమంలో అంబులెన్సు ప్రయాణిస్తుండగానే డ్రైవర్ తోపాటు క్లీనర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించసాగారు. ఆమెను లైంగికంగా వేధించారు. ఆమె వారిని గట్టిగా తిట్టినా వినిపించుకోలేదు. దీంతో ఆమె భర్త, మరిది పెద్ద ఎత్తున కేకలు వేశారు.
ఈ క్రమంలో చవానీ పోలీస్ స్టేషన్ రోడ్డు రావడంతో అంబులెన్సు డ్రైవర్ భయపడి వారిని అక్కడ దింపేశాడు. ఆమె వద్ద ఉన్న రూ.10 వేల నగదు, ఆభరణాలు లాక్కున్నారు. అంతేకాకుండా ఆమె భర్తకు పెట్టిన ఆక్సిజన్ ను కూడా తొలగించారు. దీంతో అతడి పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆ మహిళ మరిది 112, 118 నంబర్లకు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చారు.
ఆమె చెప్పిన వివరాలను నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉండటంతో ఇంకో ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి మరింత విషమంగా మారడంతో గోరఖపూర్ మెడికల్ కాలేజీకి తరలించడానికి యత్నించారు. అయితే అతడి పరిస్థితి విషమించి మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కాగా మహిళను వేధించడంతోపాటు రోగి ప్రాణాలు కోల్పోవడానికి అంబులెన్స్ డ్రెవర్, అతడి సహాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.