Begin typing your search above and press return to search.

ఆస్ప‌త్రులు లేకుండా చేయాలి.. ఉపాస‌న కామినేని ప్ర‌యోగం

ఫోరమ్‌లో ఉపాస‌న అద్భుత ప్రసంగం స్ఫూర్తిని నింపింది. ఏఐ-ఆధారిత వ్య‌వ‌స్థ‌, సమగ్ర ఆరోగ్యం, డిజిటల్ ఆవిష్కరణలు సహా భారతదేశ బలాలను త‌న స్పీచ్ లో ఉపాస‌న‌ హైలైట్ చేశారు.

By:  Tupaki Desk   |   17 Feb 2025 4:25 PM GMT
ఆస్ప‌త్రులు లేకుండా చేయాలి.. ఉపాస‌న కామినేని ప్ర‌యోగం
X

ఎంట‌ర్‌ప్రెన్యూర్, అపోలో హెల్త్ దార్శనికురాలు ఉపాసన కామినేని కొణిదెల ప్రతిష్టాత్మక హార్వర్డ్ ఇండియా బిజినెస్ ఫోరం 2025కి హాజరయ్యారు. ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క వేదిక‌పై భారతదేశ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల గురించి చర్చించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో భారతదేశాన్ని గ్లోబ‌ల్ లీడ‌ర్ గా నిలబెట్టాల‌నే త‌న ఆకాంక్ష‌ను ప్ర‌య‌త్నాన్ని వెల్ల‌డించారు.

ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తు అంటే, మరిన్ని ఆసుపత్రులను నిర్మించడం గురించి కాదు..ఇది ప్రజలకు వాటి అవసరం రాకుండా ఆప‌డం గురించిన విధానం. భారతదేశం ప్రపంచానికి ఒక ప్రణాళికను రూపొందిస్తోంది! అని ఉపాస‌న అన్నారు. యువ‌ర్ లైఫ్‌కి సార‌థిగా, అపోలో హాస్పిటల్స్ ఆవిష్కరణ వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాసన కామినేని కొణిదెల, భారతదేశం ప్రపంచ ఆరోగ్య సంరక్షణ సేవా ప్రదాతగా ఉండటం కంటే ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణ శక్తి కేంద్రంగా మారుతోందని అన్నారు.

ఫోరమ్‌లో ఉపాస‌న అద్భుత ప్రసంగం స్ఫూర్తిని నింపింది. ఏఐ-ఆధారిత వ్య‌వ‌స్థ‌, సమగ్ర ఆరోగ్యం, డిజిటల్ ఆవిష్కరణలు సహా భారతదేశ బలాలను త‌న స్పీచ్ లో ఉపాస‌న‌ హైలైట్ చేశారు. ప్రపంచం ప్రేరణ పొందగల అధునాతన ఆరోగ్య సంరక్షణ నమూనాను సృష్టి గురించి ఉపాస‌న మాట్లాడారు.

సాంకేతిక‌త‌తో ఆరోగ్య సంర‌క్ష‌ణ విధానాల్లో భారతదేశం కోసం పరిష్కారం చూపడం మాత్రమే కాదు.. మేం ప్రపంచానికి పరిష్కారాలను సృష్టిస్తున్నామని ఉపాస‌న వ్యాఖ్యానించారు. ఆరోగ్య సంరక్షణలో ఏఐ & బిగ్ డేటా సహకారంతో ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడానికి రియల్ టైమ్ డయాగ్నస్టిక్స్, ప్రిడిక్టివ్ కేర్ కోసం భారతదేశంలోని రోగుల‌ సమూహాన్ని ఎలా ఉపయోగించుకుంటుందో ఆమె నొక్కి చెప్పింది.

దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక ఆరోగ్యానికి చికిత్సకు మించిన త‌రుణోపాయంపై చ‌ర్చించారు. డిజిటల్ హెల్త్, UPI-ఆధారిత చెల్లింపులు , టెలిమెడిసిన్ నాణ్యమైన హెల్త్‌కేర్ అత్యంత మారుమూల ప్రాంతాలకు కూడా చేరుతుందని ..ప్రపంచ పెట్టుబడిదారులు భారతదేశాన్ని తదుపరి పెద్ద హెల్త్-టెక్, వెల్‌నెస్ హబ్‌గా ఎందుకు చూస్తున్నారనేది ఉపాసన ప్రసంగంలో కీల‌క అంశం.