జమిలి ఎన్నికలు 2029 నుంచి అమలు...!
ఈ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఇక ఇపుడు రంగంలోకి లా కమిషన్ దిగింది. జమిలి ఎన్నికలు 2024లో జరిగేందుకు ఏ విధంగా అవకాశాలు లేవు అని లా కమిషన్ అభిప్రాయపడింది.
By: Tupaki Desk | 29 Sep 2023 2:10 PM GMTజమిలి ఎన్నికలు అన్న మాట 2014 నుంచి వినిపిస్తోంది. కానీ అది అమలు జరగడానికి మాత్రం పుష్కర కాలం పైగా పట్టేట్లు ఉంది. ఇందుకోసం కేంద్రం గతంలో లా కమిషన్ అభిప్రాయాలను తీసుకుంది. లేటెస్ట్ గా దేశంలో ఒకే ఎన్నిక ఒకే విధానం అన్నది అమలు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్వ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ అధ్యక్షతన జమిలి ఎన్నికల మీద ఒక కమిటీని కేంద్రం నియమించింది.
ఈ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఇక ఇపుడు రంగంలోకి లా కమిషన్ దిగింది. జమిలి ఎన్నికలు 2024లో జరిగేందుకు ఏ విధంగా అవకాశాలు లేవు అని లా కమిషన్ అభిప్రాయపడింది. ఎందుకంటే చూస్తూండగానే ఆరేడు నెలలలోనే ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఇంత తక్కువ సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర్ర పాలిత ప్రాంతాలు పంచాయతీ రాజ్ నుంచి పార్లమెంట్ వరకూ ఒకేసారి ఎన్నికలు జరిపించడం అన్నది అసాధ్యం అని లా కమిషన్ పేర్కొంది.
నిజానికి జమిలి ఎన్నికలు అంటే రాజ్యాంగ సవరణలు అయుదు చేయాల్సి ఉంది దాంతో పాటు ముందూ వెనకా ఉన్న అనేక రాష్ట్రాల అసెంబ్లీలను ఒకే త్రాటిపైకి తీసుకుని వచ్చి ఎన్నికలు పెట్టాలి. ఆ విధంగా చేయాలి అంటే తప్పనిసరిగా 356 వంటి అధికరణలను కూడా సవరణ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిరాయింపుల చట్టంలోనూ కీలక సవరణలు ఉంటాయి.
ఈ విధంగా అనేక రకాలుగా కసరత్తు చేయాలి. వీటికంటే ముందు దేశంలో వివిధ పార్టీలు ఉన్న నేపధ్యంలో అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించాల్సిన అవసరం ఉంది. రామ్ నాధ్ కోవింద్ నాయకత్వంలోని కమిటీ అందరితో చర్చించాల్సి ఉంది. ఉన్న తక్కువ సమయం ఏ కోశానా సరిపోదు అన్న భావన ఉంది.
అందువల్లనే జమిలి ఎన్నికల మీద లా కమిషన్ ఇపుడు అయ్యేది కాదు అని నిక్కచ్చిగా అభిప్రాయం చెప్పింది అని అంటున్నారు. అదే విధంగా 2029 నుంచి జమిలి ఎన్నికలను దేశంలో నిర్వహించడానికి ఒక ఫార్ములాను రూపొందించడానికి కూడా లా కమిషన్ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా చూసుకుంటే మాత్రం జమిలి ఎన్నికలు అన్నవి అయితే ఇప్పట్లో జరిగేవి కావు అని అంతా అంటున్నదే. దేశంలో ఎక్కడో ఒక చోట రాష్ట్రాలకు ఏడాదిలో మూడు నాలుగు సార్లు ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో అంతా గందరగోళంగా ఉంటోంది.
ఇక అసెంబ్లీలో సింపుల్ మెజారిటీ రాని వాతావరణం ఇటీవల కాలంలో చూస్తున్నరు. ఎందుకంటే అనేక పార్టీలు పుట్టుకుని రావడం తీర్పు రెండు మూడుగా విభజింపబడడం వంటి కారణాలే అంటున్నారు. గతంలో అంటే 1952 నుంచి 1968 దాకా పదహరేళ్ల పాటు మూడు నాలుగు ఎన్నికలు జమిలి విధానంలో జరిగాయి అంటే ఏక పాలన దేశంలో రాష్ట్రాలలో ఉంది అన్నది గుర్తు తెచ్చుకోవాలి.
ఇక 1968 తరువతనే దేశ రాజకీయాల్లో ఇతర పార్టీల హవా మొదలైంది. దాంతోనే జమిలి ఎన్నికలకు అడ్డుకట్ట పడింది. దీంతో పాటు ఇపుడు కుప్పలు తెప్పలుగా పార్టీలు పుట్టుకుని వస్తున్నాయి. దాంతో మెజారిటీ ఎవరికీ రాకపోతే ఏమి చేయాలి, మధ్యలో అసెంబ్లీ రద్దు అయితే ఏమి చేయాలి, అలాగే ఎన్నికల సభ్యులు పార్టీ మారితే ఏ విధానం అనుసరించాలి.
రాష్ట్రపతిపాలన ఎపుడు పెట్టాలి, అయిదేళ్ళకు ఒకమారు ఎన్నికలు జరిగేంతవరకూ ఆయా చోట్ల అసెంబ్లీలు కూలిపోతే మిగిలిన కాలం ఏమి చేయాలన్న దాని మీద లా కమిషన్ ఇపుడు పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తోంది అని అంటున్నారు. మంచి సూచనలు విలువైన సలహాలతో లా కమిషన్ సిఫార్సులు చేస్తూ ముందుకు వస్తుందని ఆ విధంగా మరో అయిదేళ్ళకు అంటే 2029 నాటికి దేశంలో జమీలి ఎన్నికల దిశగా వాతావరణాన్ని ఈ రోజు నుంచే తయారు చేసుకుంటూ వస్తుంది అని అంటున్నారు. సో జమిలి కధ ఇపుడు కాదని అంతా అంటున్నారు.