Begin typing your search above and press return to search.

లోక్‌సభలో కూర్చోనున్న భార్య భర్తల జోడీ..

ఇంతకీ ఒకేసారి లోక్ సభ లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ దంపతులు ఎవరో తెలుసుకుందామా..

By:  Tupaki Desk   |   11 Jun 2024 12:07 PM GMT
లోక్‌సభలో కూర్చోనున్న భార్య భర్తల జోడీ..
X

ఆంధ్రాలో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలలో లోక్ సభకు సంబంధించిన ఎన్నికలు కూడా జరగాయి. సాధారణంగా ఎన్నికలలో ఒకే కుటుంబం నుంచి గెలిచే అభ్యర్థులు చాలా అరుకుగా ఉంటారు. అలాంటిది ఓకే ఎన్నికలలో వేరువేరు స్థానాలు నుంచి గెలిచి లోక్ సభ లో అడుగుపెట్టే దంపతుల సంఖ్య చాలా తక్కువ. అయితే ఇలాంటి అరుదైన సంఘటన ఈసారి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో చోటు చేసుకుంది. ఇంతకీ ఒకేసారి లోక్ సభ లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ దంపతులు ఎవరో తెలుసుకుందామా..

ఈసారి యూపీ18వ లోక్ సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ తో పాటు ఆయన భార్య డింపుల్ యాదవ్ కూడా విజయ ఢంకా మోగించారు.ఈ నేపధ్యంలో ఒకేసారి లోక్ సభ లో అడుగుపెట్టనున్న ఈ జంట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ అధినేతగా, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం గా అందరికీ సుపరిచితుడే. అతని భార్య డింపుల్ యాదవ్ లోక్ సభ స్థానానికి ఎన్నిక కావడం ఇదే తొలి సారి. 2024 లోక్ సభ ఎన్నికల్లో అందుకే ఏమైనా విజయం తన ఖాతా లో వేసుకున్న డింపుల్ ఇప్పుడు భర్తతో కలిసి లోక్ సభ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

అఖిలేష్ కన్నౌజ్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అతని భార్య డింపుల్ యాదవ్

మెయిన్పురి స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. తొలత ఆమె విజయం పై సందేహాలు ఉన్నప్పటికీ.. అంచనాలను తలకిందులు చేస్తూ భారీ మెజారిటీతో గెలుపు సొంతం చేసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఈ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారిటీతో విజయ ఢంకా మోగించారు.

అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచిన ఎస్పీ ఎంపీ గా డింపుల్ యాదవ్ మొదటి స్థానంలో నిలవగా, ఆమె భర్త రెండవ స్థానంలో ఉన్నారు. లోక్‌సభ చరిత్రలో ఇలా భార్యాభర్తలు కలిసి కూర్చోవడం ఇదే తొలిసారి . లోక్‌సభ కార్యకలాపాల సమయంలో వీరిద్దరూ సభకు కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి వీరిపైనే ఉంటుంది. 2019 లోక్‌ సభ ఎన్నికల్లో కూడా ఇద్దరూ కలిసి పోటీ చేశారు. అప్పుడు అఖిలేష్ యాదవ్ అజ్గంఘర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కన్నౌజ్ నుంచి పోటీ చేసిన డింపుల్ యాదవ్ ఓటమి పాలయ్యారు.

ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి సీటు ఖాళీ అయింది. దీంతో అక్కడి నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన డింపుల్ యాదవ్ అనుప్య విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈసారి కేవలం అఖిలేష్ యాదవ్ తన భార్యతో మాత్రమే లోక్ సభ కు హాజరు కావడం లేదు. అతనితోపాటు ఈసారి అతని ముగ్గురు సోదరులు కూడా ఎంపీలుగా సభకి రాబోతున్నారు.

కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్, మెయిన్పురి నుంచి డింపుల్ యాదవ్ తో పాటు అజంగఢ్ నుంచి ధర్మేంద్ర యాదవ్, ఫిరోజాబాద్ నుంచి అక్షయ్ యాదవ్, బదౌన్ నుంచి ఆదిత్య యాదవ్‌లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఈ విధంగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

ఎంపీలుగా ఒకేసారి లోక్ సభ లోకి అడుగుపెట్టడం మరొక సరికొత్త రికార్డు కి నాంది పలుకుతోంది.