స్వీపర్ ఉద్యోగం చేస్తూ కోట్ల ఆస్తులు... తెరపైకి షాకింగ్ విషయాలు!
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ స్వీపర్ భాగోతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మరింది.
By: Tupaki Desk | 18 Aug 2024 5:30 PM GMTఈ దేశంలో ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా మంది అధికారుల అధికారిక సంపాదన కంటే అనధికారిక సంపాదన ఎక్కువగా ఉంటుందనే చర్చ జరుగుతుంటుందన్న సంగతి తెలిసిందే. ఏసీబీ రైడ్స్ జరిగినప్పుడు ఈ చర్చకు బలం చేకూరుతుంటుంది. ఈ సమయంలో గవర్నమెంట్ ఆఫీసుల్లో ఓ స్వీపర్ గా పనిచేస్తున్న వ్యక్తి సైతం భారీ స్థాయిలో అవినీతి చేయగలడని నిరూపించే ఘటన తెరపైకి వచ్చింది.
అవును... పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి భారీ ఎత్తున జరుగుతుందని అంటుంటారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ స్వీపర్ భాగోతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మరింది. అతడికి 9 లగ్జరీ కార్లు ఉండటాన్ని చూసి అధికారులు నోరెళ్లబెట్టరని తెలుస్తోంది. ఇక ఆస్తుల సంగతి చెప్పే పనే లేదంట. ఇంతకూ ఈ వ్యవహారం ఏమిటో ఇప్పుడు చూద్దాం..!
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాకు చెందిన ఓ స్వీపర్ కోట్లకు పడగలెత్తాడు. సంతోష్ జైస్వాల్ అనే ఈ వ్యక్తి తొలుత గోండా ముస్నిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా చేరాడు. ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా డివిజనల్ కమిషనర్ ఆఫీసులో స్వీపర్ గా ప్రమోషన్ పొందాడని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆ ఆఫీసులోని ప్రభుత్వ ఫైళ్లను తారుమారు చేయడం స్టార్ట్ చేశాడంట.
ఈ నేపథ్యంలోనే సుమారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించాడు. అయితే ఫైళ్లు తారుమారవుతున్నట్లు గ్రహించిన కమిషనర్ విచారణకు ఆదేశించారు. దీంతో.. స్వీపర్ గా పనిచేస్తున్న సంతోష్ జైస్వాల్ గుట్టు రట్టయ్యిందని అంటున్నారు. దీంతో అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిన అధికారులు పోలీసు కేసు పెట్టారు.
ఈ నేపథ్యంలోనే సంతోష్ జైస్వాల్ ఆస్తులను పరిశీలించిన అధికారులు నోరెళ్లబెట్టారంట. ఈ సమయంలో అతడి వద్ద 9 లగ్జరీ కార్లు ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు. అయితే... ఈ కార్లను సంతోష్ భార్య, సోదరుడి పేరు మీద ఉన్నట్లు ట్రాన్స్ పోర్ట్ అధికారులు నివేదిక ఇచ్చారని అంటున్నారు. దీంతో అతడిపై కఠినచర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు!