వైరల్... యూఎస్ ఓటర్లు ఎలా విడిపోయారో తెలుసా?
అవును... ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్న్నికల్లో ఓటింగ్ ప్రాధాన్యతలు విద్యార్హతల ఆధారంగా విభజించబడ్డాయని అంటున్నారు.
By: Tupaki Desk | 8 Nov 2024 1:49 PM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల సందడి ముగిసిన సంగతి తెలిసిందే. మునుపెన్నడూ లేని స్థాయిలో అన్నట్లుగా అత్యంత రసవత్తరంగా జరిగాయి. ఎన్నో ట్విస్టులు, మరెన్నో జలక్కులు, తుపాకీ చప్పుళ్లు, నిందితుల అరెస్టులు, బ్యాలెట్ బాక్సుల దగ్ధాలు వెరసి ఈ సారి యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అత్యంత హాట్ టాపిక్ గా మారాయి.
ఈ స్థాయిలో జరిగిన తాజా ఎన్నికల్లో సర్వేల ఫలితాలు, విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ పై విజయం సాధించారు. అయితే... ఈ ఎన్నికల్లో హారిస్ ఓటమికి, ట్రంప్ గెలుపుకు గల కారణాలను విశ్లేషిస్తున్న నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి.
అవును... ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్న్నికల్లో ఓటింగ్ ప్రాధాన్యతలు విద్యార్హతల ఆధారంగా విభజించబడ్డాయని అంటున్నారు. ఈ మేరకు యాక్సియోస్ నివేదిక పలు కీలక విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... కాలేజీ గ్రాడ్యుయేట్లు హారిస్ కు అనుకూలంగా ఉండగా.. డిగ్రీ లేనివారి ఓట్లు ట్రంప్ కు సహకరించారని అంటున్నారు.
అమెరికా ఓటర్లలో అత్యధికంగా 43 శాతం మంది కాలేజ్ గ్రాడ్యుయేట్లు ఉండగా.. వారిలో 55 శాతం మంది హారిస్ కు ఓట్లు వేసినట్లు ఎగ్జిట్ పోల్స్ చూపించాయని అంటున్నారు. ఇదే సమయంలో... గ్రాడ్యుయేషన్ లేని ఓటర్లలో 55 శాతం మంది ట్రంప్ కు మద్దతు తెలిపారని చెబుతున్నారు.
ఇక ఫోర్బ్స్ ప్రకారం... ట్రంప్ యువ ఓటర్ల మద్ధతును గెలుచుకోగా.. హారిస్ గత డెమోక్రాట్లతో పోలిస్తే వెనుకబడ్డారని అంటున్నారు. వాస్తవానికి 18 నుంచి 29 సంవత్సరాల వయసు గల ఓటర్లు గతంలో బిల్ క్లింటన్ కు 19, జో బిడెన్ కు 24 పాయింట్ల ఆధిక్యాన్ని ఇవ్వగా... కమలా హారిస్ దగ్గరకు వచ్చేసరికి ఈ సపోర్ట్ 11 పాయిట్లకు పరిమితమైందని చెబుతున్నారు.