తైవాన్ రక్షణ కోసం బిన్ లాడెన్ కిల్లర్స్ ‘సీల్ టీమ్-6’కు శిక్షణ..!
ఈ నేపథ్యంలో తైవాన్ ను చైనా బారి నుంచి కాపాడడానికి అమెరికా రహస్యంగా ఏర్పాటు చేస్తోంది.
By: Tupaki Desk | 12 Sep 2024 3:30 PM GMTప్రపంచ దేశాల మధ్య శాంతి సంబంధాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు కానీ ఇంటర్నల్ గా ఒకరిపై ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ప్రపంచంలో అగ్రగానిగా మెలగాలి అనే ఉద్దేశం ఎన్నో దేశాలు మెల్లగా కనబరుస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పోటీలో కొన్ని దేశాలు తమకంటే చిన్న దేశాలను అణిచివేయడానికి ప్రయత్నించడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి పరిస్థితులే మనం చైనా, తైవాన్ మధ్య గమనించవచ్చు. ఈ నేపథ్యంలో తైవాన్ ను చైనా బారి నుంచి కాపాడడానికి అమెరికా రహస్యంగా ఏర్పాటు చేస్తోంది.
చైనా ఆక్రమణ ఎదుర్కోవడం కోసం తమ వద్ద ఉన్న అత్యున్నతమైన నేవీ సీల్స్ బృందాన్ని అమెరికా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. 2011 లో అల్-ఖైదా నేత బిన్ లాడను పాకిస్తాన్లోకి చొచ్చుకు వెళ్లి మరి అంతం చేసిన బృందం ఇది. తాజాగా తైవాన్ పై పెరుగుతున్న చైనా దురాక్రమనను అడ్డుకోవడానికి ఈ బృందానికి అమెరికా ప్రత్యేకంగా ట్రైనింగ్ మొదలుపెట్టిందట. ఈ విషయాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది.
అమెరికాలో ఎన్నో బలమైన దళాలు ఉన్నాయి.. కానీ సున్నితమైనటువంటి ఆర్మీ ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మొదటి ప్రిఫరెన్స్ ఈ బృందానికి దక్కుతుంది. ఇక ఈ ప్రత్యేకమైన టాస్క్ కోసం ఈ బృందం సభ్యులు వర్జీనియా బీచ్ లో ఏడాదిగా శిక్షణ పొందుతున్నారు. వాళ్లు తీసుకుంటున్న ట్రైనింగ్ ఇంటెన్సిటీ చూస్తే చైనా తో ఈసారి పెద్ద ఘర్షణ తప్పదని అమెరికా ముందుగానే ఊహించి వ్యూహాలు వేస్తోందేమో అనిపించక మానదు.
అమెరికా దళాల పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చే డెల్టా ఫోర్స్ తో సమానమైన టీం గా నేవీ సీల్స్ను భావిస్తారు. ఈ బృందం కేవలం జాయింట్ స్పెషల్ ఆపరేషన్ కమాండ్కు మాత్రమే రిపోర్ట్ చేస్తుంది. అత్యంత రహస్యంగా నిర్వహించాల్సినటువంటి ఆపరేషన్లకు ఈ బృందాన్ని ఎంచుకుంటా. 2009లో హైజాక్ చేసి బంధించిన కంటైనర్ షిప్ ను కూడా సురక్షితంగా కాపాడడానికి ఈ బృందం ఎంతో సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది.
ఇటీవల కాలంలో తైవాన్ కు తరచుగా పెంటగాన్ నుంచి ప్రత్యేక బృందాలు వెళ్తున్నాయి అని ఫైనాన్షియల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అక్కడ ఉన్న దేశ సైన్యానికి కూడా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారట. అంతే కాదు తమ
వార్షిక బడ్జెట్ నుంచి 20 శాతం మొత్తం చైనాను ఎదుర్కోవడానికి ఉపయోగించబోతున్నట్లు సీఐఏ డైరెక్టర్ బిల్ బర్న్స్ ఇటీవల పేర్కొన్నారు. అయితే ఈ పరిణామలపై వాషింగ్టన్లోని చైనా దౌత్య ప్రతినిధి ల్యూ
పెనగ్యూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.