బిగ్ అలర్ట్... 'ట్రంప్ రాకముందే అమెరికా వెలుపల ఉన్నవాళ్లు వచ్చేయండి'!
ఈ నేపథ్యంలో... అమెరికా వెలుపల ఉన్న తమ విద్యార్థులు, అధ్యాపకులకు అక్కడి విద్యాసంస్థలు ఆసక్తికర పిలుపు ఇచ్చాయి.
By: Tupaki Desk | 27 Nov 2024 7:12 AM GMTఅమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరించనున్నారని అంటున్నారు. దీంతో... ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో... అమెరికా వెలుపల ఉన్న తమ విద్యార్థులు, అధ్యాపకులకు అక్కడి విద్యాసంస్థలు ఆసక్తికర పిలుపు ఇచ్చాయి.
అవును... రీ ఎంట్రీ వీసా ఉండి, శీతాకాల విరామ సమయంలో అమెరికా వెలుపల ఉన్నవారు (విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది).. నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టేలోపు తిరిగి రావాలని సూచిస్తున్నాయి అమెరికా యూనివర్సిటీలు, కాలేజీలు. ఇప్పుడు ఈ పిలుపు ఆసక్తికరంగా మారింది.
ఈ మేరకు... స్ప్రింగ్ అకడమిక్ సీజన్ ప్రారంభమయ్యేలోపు (జనవరి 6) తమ విద్యార్థులకు వర్తమానం పంపించింది నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ. ఇదే సమయంలో... శీతకాలం బయటి దేశాలకు వెళ్లినవారు జనవరి 19 నాటికి క్యాంపస్ కు తిరిగి రావాలని వెల్సియన్ యూనివర్సిటీ తన విద్యార్థులకు లేఖ రాసింది.
అదేవిధంగా... వెస్లియన్, మసాచుసెట్స్, మిడిల్ టౌన్ తదితర యూనివర్సిటీలు సైతం తమ విద్యార్థులు, విజిటింగ్ స్కాలర్లు, అధ్యాపకులు, ఇతర సిబ్బందికి ఇదే తరహా సూచనలు చేస్తూ.. లేఖలు రాస్తున్నాయి. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమ్మిగ్రేషన్స్ విషయంలో ట్రంప్ ఎలాంటి ఆక్షలు విధిస్తారోనని వర్సిటీలు ఈ మేరకు జాగ్రత్తపడుతున్నాయి.
వాస్తవానికి 2017లో ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి సమస్య ఒకటి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... అమెరికాకు తిరిగివచ్చే అంతర్జాతీయ విద్యార్థులు, ఇతరులపై కొన్ని ఆంక్షలు విధించారు. ఆ సమయంలో.. ఇరాన్ సహా ఏడు ముస్లిం మెజరిటీ దేశాల ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం ప్రకటించారు.
ఈ స్థాయిలో ఉన్న నాటి అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న వర్సిటీలు ఈ దఫా అప్రమత్తమవుతున్నాయి. ఈ సారి కూడా బాధ్యత్లు చేపట్టిన వెంటనే ట్రంప్ ఎలాంటి రూల్స్ అమలు చేస్తారో అనే అంశంపై రకరకాల ఊహాగాణాలు తెరపైకి వస్తోన్న నేపథ్యంలో ఇలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.