Begin typing your search above and press return to search.

యూఎస్ విసా రెన్యువల్ చేయాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్!

తాజాగా వీసా రెన్యువల్ విషయంలో ప్రపంచానికి మరో చేదువార్త వెల్లడించిందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   14 Feb 2025 10:53 AM GMT
యూఎస్ విసా రెన్యువల్  చేయాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్!
X

డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమెరికా వీసా విషయాలకు సంబంధించిన వార్తలు తీవ్ర ఆందోళనలు కలిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్ట్ టైం జాబ్స్ పేరూ చెప్పి విద్యార్థులను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేసిన ట్రంప్ సర్కార్.. తాజాగా వీసా రెన్యువల్ విషయంలో ప్రపంచానికి మరో చేదువార్త వెల్లడించిందని తెలుస్తోంది.

అవును... అమెరికా వీసా రెన్యువల్ కోసం తీసుకొచ్చిన "డ్రాప్ బాక్స్" నిబంధనలను కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. ఈ విధానం ప్రకారం గత 12 నెలల్లో గడువుతీరిన వీసాలను మాత్రమే ఇంటర్వ్యూ లేకుండా పునరుద్ధరించుకునే ఛాన్స్ ఉంటుంది. వాస్తవానికి అంతకుముందు ఈ గడుపు 48 నెలలుగా ఉండేది. తాజా నిబంధనలు తక్షణమే అమల్లోకి అని అంటున్నారు.

తాజాగా పలు ఆంగ్ల మీడియాల్లో వెలువడుతోన్న కథనాల ప్రకారం.. తాజా డ్రాప్ బాక్స్ నిబంధనలతో హెచ్-1బీ సహా బీ1/బీ2 వంటి నాన్ ఇమిగ్రెంట్ వీసాదరుల దరఖాస్తులపై తీవ్ర ప్రభావం పడనుందని అంటున్నారు. ఇందులో భాగంగా... వీసా రెన్యువల్ కోసం వీరు సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

వాస్తవానికి కరోనా మహమ్మారి కాలానికి ముందు ఇంటర్వ్యూ లేకుండా అమెరికా వీసా రెన్యువల్ కోసం 12 నెలల నిబంధనే అమల్లో ఉండేది. ఈ సమయంలొ.. వీసా మంజూరు, రెన్యువల్ కు పడుతున్న సమయాన్ని దృష్టీలో పెట్టుకొని 2022లో డ్రాప్ బాక్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి ఈ 48 నెలల గడువు తెరపైకి వచ్చింది.

అంటే.. గత 48 నెలల్లో గడువు పూర్తయిన వారు కూడా ఇంటర్వ్యూ లేకుండానే వీసా రెన్యువల్ కు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. అయితే.. ఇప్పుడు ట్రంప్ 2.0లో భాగంగా... మళ్లీ పాత పద్దతి తెరపైకి తెచ్చారు. దీని ప్రకారం... వీసా గడువు తీరి సంవత్సరం దాడినవారు రెన్యువల్ కోసం మళ్లీ పర్సనల్ గా ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సి ఉంటుంది!