Begin typing your search above and press return to search.

యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు రోజు ముందు బలాబలాలేంటి?

యావత్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ రేపు జరగనుంది.

By:  Tupaki Desk   |   4 Nov 2024 4:45 AM GMT
యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు రోజు ముందు బలాబలాలేంటి?
X

నెలల తరబడి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. యావత్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ రేపు జరగనుంది. పోటాపోటీగా నడుస్తున్న ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ ఎన్నికల్లో తుది ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై బోలెడన్ని అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎన్నికలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఇద్దరు అభ్యర్థులు ప్రజల నాడికి అనుగుణంగా తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న పరిస్థితి. పోలింగ్ కు రోజు ముందు ఇద్దరు అభ్యర్థుల మధ్య వ్యత్యాసం ఎంత? దాని లెక్కేంటి? అన్న వివరాల్లోకి వెళితే..

అమెరికా ఎన్నికల ఫలితాల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తునన కొన్ని సంస్థలు ఉన్నాయి. వీటి పనేమంటే.. మారే ట్రెండ్స్ ను లైవ్ లో ఎప్పటికప్పుడు ఇస్తూ.. ఎవరి బలమేమిటన్న దానిపై తన అంచనాలు చెబుతున్న ఆ సంస్థలు చెబుతున్న మాట ఒక్కటే. పోటీ పోటాపోటీగా ఉన్న నేపథ్యంలో అధ్యక్ష కుర్చీలో కూర్చునేందుకు అవసరమైన అర్హత 272 సీట్లు. అయితే.. ఇద్దరు అభ్యర్థులు ఈ మేజిక్ ఫిగర్ కు 50 స్థానాల దూరంలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఇందులోనూ ట్రంప్ తో పోలిస్తే కమలా హారిస్ ఒక అడుగు ముందు ఉన్నట్లుగా సదరు సంస్థలు లెక్క గడుతున్నాయి. కమలకు 226 సీట్లు ఖాయమని.. ట్రంప్ 2019 స్థానాల్లో ముందు ఉన్నట్లుగా పేర్కొంటున్నారు. అంటే.. మ్యాజిక్ ఫిగర్ కు కమల కేవలం 44 సీట్ల దూరంలో ఉంటే.. ట్రంప్ మాత్రం 51 స్థానాల వ్యత్యాసంతో ఉన్నారు. దీంతో.. మెజార్టీ కోసం స్వింగ్ రాష్ట్రాలపైనే ఇద్దరు అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే.. పోలింగ్ కంటే ముందే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం యూఎస్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎర్లీ పోలింగ్ సదుపాయాన్ని ఇప్పటివరకు 6.8 కోట్ల మంది అమెరికన్లు వినియోగించుకున్నారు. పోలింగ్ రోజున ప్రతికూల వాతావరణం కానీ.. రద్దీగా ఉండే పరిస్థితి. అందుకే అలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఉండేందుకు ముందుగానే ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. 1945 తర్వాత యావత్ ప్రపంచం ఇంత ఎక్కువగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని ఆసక్తిగా చూస్తున్నది లేదని చెబుతున్నారు.