Begin typing your search above and press return to search.

ట్రంప్ కు మస్క్... హారిస్ కోసం బిల్ గేట్స్... తెరపైకి భారీ విరాళం!

గతంలో ఎన్నడూ లేనంతంగా అన్నట్లుగా ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరుగుతున్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 Oct 2024 6:54 AM GMT
ట్రంప్ కు మస్క్... హారిస్ కోసం బిల్ గేట్స్... తెరపైకి భారీ విరాళం!
X

గతంలో ఎన్నడూ లేనంతంగా అన్నట్లుగా ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరుగుతున్నాయని అంటున్నారు. ఈ ఎన్నికల్లో బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ లు ఎవరి స్టైల్లో వారు దూసుకుపోతున్నారు. ఈ సమయంలో కమలా హారిస్ కోసం బిల్ గేట్స్ ఎంట్రీ ఇచ్చారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును... ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నిలబడిన సంగతి తెలిసిందే. ప్రెసిడెంట్ అయ్యేవరకూ తాను ట్రంప్ పక్కనే ఉంటానంటూ ప్రకటించారు. ఇక అధికారికంగా భారీ ఎత్తున విరాళాలు ఇచ్చారని.. ఇందులో భాగంగా సుమారు 75 మిలియన్ డాలర్ల విరాళాలు ట్రంప్ కోసం మస్క్ ఇచ్చారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కోసం బిల్ గేట్స్ ఎంటరయ్యారని అంటున్నారు. ఇందులో భాగంగా ఆమె కోసం పనిచేసే ఓ ఎన్జీవో కు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు భారీ మొత్తంలో విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక పత్రికలు దీనికి సంబంధించిన కథనాలు అందిస్తున్నాయి. దీంతో... ఈ విషయం ఆసక్తిగా మారింది.

వాస్తవానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బిల్ గేట్స్ ఎవరికీ బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. అయితే... ట్రంప్ మరోసారి ప్రెసిడెంట్ అయితే ఏర్పడే పరిస్థితులపై తన సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కమలా హారిస్ కోసం $50 మిలియన్లు (సుమారు రూ.420 కోట్లు) విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ విషయాలపై స్పందించిన బిల్ గేట్స్... పేదరికాన్ని తగ్గించడం, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావారణంలో మార్పులు తెచ్చేందుకు కృషి చేసేవారికి తన మద్దతు అని అన్నారు! పొలిటీషియన్స్ తో పనిచేసిన అనుభవం తనకు ఉందని.. ఈ ఎన్నికలు చాలా భిన్నమైనవని పేర్కొన్నారు.

కాగా... 538 పోల్ ట్రాకర్ రోజువారీ అంచనాల్లో భాగంగా మంగళవారం (అక్టోబర్ 22) రాత్రి 8:30 గంటల సమయంలో... డొనాల్డ్ ట్రంప్ పై కమలా హారిస్ 1.7శాతం ఆధిక్యంలో ఉన్నారు.