అమెరికా ఎన్నికల సర్వేలు విఫలం.. రీజనేంటి?
ఇక, డొనాల్డ్ ట్రంప్‌తో చర్చల విషయంలో బైడెన్ పూర్తిగా విఫలమయ్యారు. దీంతో బైడెన్ ప్లేస్‌ను కమలా హ్యారిస్‌తో రీప్లేస్ చేశారు.
By: Tupaki Desk | 6 Nov 2024 3:30 PM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి.. అనేక సర్వేలు వచ్చాయి. దాదాపు ఏడాదిన్నర నుంచి జరు గుతున్న ప్రచారం.. రాజకీయ చర్చలు వంటివి అందరికీ తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడు, డెమొక్రాటిక్ పార్టీ నేత బైడెన్ మరోసారి అధ్యక్ష బరిలోకి వచ్చిన తర్వాత.. రిపబ్లికన్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఇక, డొనాల్డ్ ట్రంప్‌తో చర్చల విషయంలో బైడెన్ పూర్తిగా విఫలమయ్యారు. దీంతో బైడెన్ ప్లేస్‌ను కమలా హ్యారిస్‌తో రీప్లేస్ చేశారు.
ఈ పరిణామం తర్వాత.. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు మరింత వేడెక్కాయి. ఒకానొక దశలో అయితే.. ట్రంప్ శిబిరం అంతర్మథనంలోకి కూడా జారుకుంది. భారత దేశ మూలాలు ఉన్న కమలా హ్యారిస్.. విజ యం నల్లేరుపై నడకేనన్నది సర్వేల సంస్థలు కూడా చెప్పాయి. ఇక, ట్రంప్ విషయంలోనూ అనేక చర్య లు సాగాయి. ఆయన గెలవడం కష్టమని కూడా కొన్ని సర్వేలు చెప్పుకొచ్చాయి. అంతెందుకు.. శనివారం-ఆదివారం నాటి సర్వేలను చూస్తే.. ట్రంప్‌కు ఛాన్స్‌లేదనే సంకేతాలు వచ్చాయి.
అంతేకాదు.. దిగ్గజ సర్వే సంస్థలైన సీఎన్ఎన్, బీబీసీవంటి అంతర్జాతీయ సంస్థలు కూడా కమల వైపే మొగ్గు చూపాయి. ఆమె గెలుపు కష్టం కాదని కూడా వెల్లడించాయి. కానీ, అనూహ్యంగా కమల వెనుకబడి పోయారు. ప్రతినిధుల సభలో పట్టు కోల్పోయారు. ముఖ్యంగా ఆది నుంచి రిపబ్లికన్లను వ్యతిరేకించే స్వింగ్ స్టేట్స్(ఇవి డెమొక్రాట్లకు అత్యంత అనుకూల రాష్ట్రాలు)లో కూడా కమల తన పట్టును బిగించలేక పోయారు. ఫలితంగా సర్వే సంస్థలు తిరగబడినట్టయింది.
ఎలా చూసుకున్నా.. సర్వేలు విఫలయమ్యాయనే చెప్పాలి. అంతేకాదు.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పేరున్న అభినవ నాస్ట్రాడొమస్ కూడా కమలదే పైచేయి అని చెప్పడం గమనార్హం. చిత్రం ఏంటంటే.. సదరు నాస్ట్రాడొమస్.. ఇప్పటి వరకు చెప్పిన అనేక సర్వేలు. అంచనాలు 100 శాతం సక్సెస్ అయ్యాయి. కానీ, ఇప్పుడు మాత్రం ట్రంప్ విజయాన్ని ఎవరూ ఊహించకపోవడం.. బైడెన్ శిబిరంలో మార్పు జరిగినా.. కమల బలమైన ఊపు తీసుకురాలేకపోవడం వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయి. అంతేకాదు.. ప్రజల అంతర్గత అభిప్రాయాలను పసిగట్టడంలో సర్వేలు విఫలమయ్యాయనే చెప్పాలి.