ట్రంపా.. మజాకా... విదేశీ ఉద్యోగులు ఉన్న కంపెనీలకు కొత్త టెన్షన్ స్టార్ట్!
2023-24 అకడమిక్ ఇయర్ లో అమెరికాలోని కాలేజీలు, యూనివర్శిటీ సుమారు 1.1 మిలియన్లకు పైగా అంతర్జాతీయ విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు చెబుతున్నారు.
By: Tupaki Desk | 14 Jan 2025 8:30 AM GMTఅమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. జనవరి 20న అగ్రరాజ్యం అధినేతగా బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో నిన్నటివరకూ అమెరికాలోని యూనివర్శిటీలు, కళాశాలలకు టెన్షన్ స్టార్ట్ అవ్వడం.. దీంతో పలు విద్యాసంస్థలు.. వింటర్ విరామం నుంచి ముందుగానే క్యాంపస్ కు తిరిగి రావాలని రిక్వస్టులు పంపడం తెలిసిందే.
అంతర్జాతీయ విద్యార్థుల విషయంలో ట్రంప్ సరికొత్త నిబంధనలు ఎలా ఉంటాయనేదానిపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో... అమెరికాలోని యూనివర్శిటీలు, కాలేజీలకు ట్రంప్ టెన్షన్ మొదలైందని.. వింటర్ విరామానికి ముందే క్యాంపస్ లకు తిరిగిరావాలని మెయిల్స్ పెట్టాయని చెబ్బుతున్నారు. ఈ సమయంలో ఉద్యోగుల విషయంలోనూ కంపెనీలు అదే పనిలో ఉన్నాయని అంటున్నారు.
అవును... 2023-24 అకడమిక్ ఇయర్ లో అమెరికాలోని కాలేజీలు, యూనివర్శిటీ సుమారు 1.1 మిలియన్లకు పైగా అంతర్జాతీయ విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే... ట్రంప్ తిరిగి వైట్ హౌస్ కు చేరుకున్న తర్వాత.. కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనల అమలు తెరపైకి తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో... ఇప్పటికే విదేశీ విద్యార్థులకు ఈ మేరకు ఈ-మెయిల్స్ పంపినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... ట్రంప్ వైట్ హౌస్ కు తిరిగి రావడానికి కనీసం వారం ముందు యూఎస్ కి తిరిగిరావాలని యూనివర్శిటీలు కోరుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో... అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు ఈ మేరకు ఈ-మెయిల్స్ వెళ్లినట్లు చెబుతున్నారు.
ఇందులో భాగంగా... భారత్ సహా ఇతర దేశాలకు వెళ్లిన తమ ఉద్యోగులు జనవరి 20 లోపు అమెరికాలో వాలిపోవాలని.. ఆ తర్వాత ఏమైన జరిగే అవకాశం ఉందని పలు కంపెనీల యాజమాన్యాలు ఈ-మెయిల్స్ పెడుతున్నాయని చెబుతున్నారు. దీంతో... సంక్రాంతి పండుగ కూడా ప్రశాంతంగా చేసుకోనివ్వడం లేదన్నట్లుగా ఎప్పుడు ఫ్లైట్ దొరికితే అప్పుడు యూఎస్ వెళ్లిపోతున్నారంట జనాలు!
కాగా.. ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. బాధ్యతలు చేపట్టిన తొలిరోజే 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. మరోపక్క ప్రధానంగా ఆయన తొలి నిర్ణయం.. విదేశీ ఉద్యోగులు, వీసాలపైనే ఉంటుందనే చర్చా బలంగా సాగుతున్న పరిస్థితి.
దానికీ ఓ బలమైన కారణం ఉంది. ఎన్నికల సమయంలోనూ స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు లభించేలా చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ సమయంలో ఆ హామీని నెరవేర్చాలంటే.. "అమెరికా ఫస్ట్" అనే స్లోగన్ కు న్యాయం జరగాలంటే ఆయన ఫస్ట్ టార్గెట్ హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు విధించడమే అనే చర్చా తెరపైకి వచ్చింది.
హెచ్-1బీ వీసాలు ఆపుతారని కాదు కానీ.. మరింత కఠినమైన నిబంధనలు తెచ్చే అవకాశం మాత్రం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో... మరికొన్ని వీసాలను రద్దు చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు అలర్ట్ అయ్యాయి.. ట్రంప్ కుర్చీ ఎక్కే లోపు తిరిగి అమెరికాకు రావాలని కోరుతున్నట్లు చెబుతున్నారు.