బిగ్ అలర్ట్... అమెరికాలో ఉంటున్న ప్రతీ విద్యార్థి తెలుసుకోవాల్సిన విషయం!
అవును... అమెరికాలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మరో మాట లేకుండా దేశ బహిష్కరణ నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ 2.0 సర్కార్ దెబ్బకు అక్కడున్న విదేశీ (భారతీయ) విద్యార్థులు వణికిపోతున్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 26 Jan 2025 5:30 AM GMTఅమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ గడ్డకట్టిస్తున్న చలికంటే ఎక్కువగా అక్రమంగా అక్కడకు వలసవెళ్లినవారు వణికిపోతున్న సంగతి తెలిసిందే! తాత్కాలిక వీసాలపై వచ్చినవారిదీ ఇదే పరిస్థితి అని అంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులనూ సరికొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ సమయంలో పార్ట్ టైమ్ జాబ్స్ కి సంబంధించి కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది.
అవును... అమెరికాలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మరో మాట లేకుండా దేశ బహిష్కరణ నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ 2.0 సర్కార్ దెబ్బకు అక్కడున్న విదేశీ (భారతీయ) విద్యార్థులు వణికిపోతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే.. ఇంట్లో వారికి భారం కాకుండా పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకునే విద్యార్థులకు బిగ్ అలర్ట్ ఒకటి తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో హల్ చల్ చేస్తోంది.
ఈ సందర్భంగా... ఈ వీడియోలో.. 'ఇది అమెరికాలో ఉంటున్న ప్రతీ విద్యార్థి తెలుసుకోవాల్సిన విషయం' అని మొదలుపెట్టిన సదరు నెటిజన్... ఇప్పటివరకూ వివిధ రాష్ట్రల్లో చెక్కింగ్స్ జరగడం చూశామని.. అయితే ఇప్పటివరకూ టెక్సాస్ లో అందులోనూ డల్లాస్ లో ఎటువంటి రైడ్స్ జరగలేదని తెలిపారు. ఈ సమయంలో డౌన్ టౌన్ యూనివర్శిటీ వద్ద తెలిసిన ఓ విద్యార్థి డెలివరీ చేయడానికి వెళ్లినప్పుడు ఓ షాకింగ్ అనుభవం ఎదురైందని అన్నారు.
ఇందులో భాగంగా... యూనివర్శల్ పార్క్ సమీపంలోని డల్లాస్ డౌన్ టౌన్ సమీపంలోని రెస్టారెంట్ లో ఘటన జరిగిందని.. పోలీస్ చె క్కింగ్ లో అదృష్టవశాత్తు ఇండియన్ స్టూడెంట్ ఒకరు కొద్దిలో తప్పించుకోగలిగారని.. ఆ దెబ్బకు అంతా డోర్ డెలివరీ జాబ్స్ మానేశారని.. ఇది అందరికీ బిగ్ అలర్ట్ అని తెలిపారు. జరిగిన విషయాన్ని వివరించారు.
అందరితో పాటు అతడిని పోలీసులు చెక్ చేసి, 'ఇక్కడ(రెస్టారెంట్)కు ఎందుకు వచ్చావు' అని అడిగితే... అప్పటికప్పుడు సమయస్పూర్తితో 'తినడానికి వచ్చాను' అని చెప్పిన అనంతరం.. స్టేటస్ ను అడిగారట పోలీసులు.. అప్పుడు తనవద్ద ఉన్న డిజిటల్ కాపీ చూపించడంతో పాటు, కంపెనీ ఇచ్చిన ఆఫర్ లెటర్ ను చూపించినట్లు చెబుతున్నారు. దీంతో... పోలీసులు అతడిని వదిలిపెట్టారట.
ఆ దెబ్బకు తనకు తెలిసినవారంతా డోర్ డ్యాష్ (డీడీ) అకౌంట్స్ అన్నీ ఆపేశారని తెలిపారు. అంటే... విదేశీ విద్యార్థుల పార్ట్ టైమ్ జాబ్స్ పై నిఘా, తనిఖీ అనే ప్రక్రియ డల్లాస్ లోనూ మొదలైనట్లేనని.. ఈ సమయంలో డొర్ డెలివరీ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో అవన్నీ తక్షణమే ఆపేయాలని సదరు నెటిజన్ తన వీడియో ద్వారా సూచించారు.
కాగా.. విదేశీ విద్యార్థుల పార్ట్ టైమ్ జాబ్స్ విషయంలో అమెరికాలో చాలా నిబంధనలు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్ర్థులు క్యాంపస్ లో మాత్రమే వారానికి 20 గంటలు పని చేసే అవకాశం లభిస్తుంది. అయితే... చాలా మంది రోజువారీ ఖర్చుల కోసం బయట పార్ట్ టైం జాబ్స్ చేస్తుంటారు.
ఇందులో భాగంగా చాలా మంది అమెరికాలోని రెస్టారెంట్లలో గ్యాస్ స్టేషన్ లలో, సూపర్ మార్కెట్స్ లో పని చేస్తుంటారు. తద్వారా వచ్చే ఆదాయంతో రోజు వారీ ఖర్చులకు సరిపోతుందని చెబుతుంటారు. అయితే... తాజా రూల్స్ కి విరుద్ధంగా పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న విషయం బయటపడితే దేశం నుంచి బహిష్కరించే ప్రమాధం పుష్కలంగా ఉందని అంటున్నారు.