Begin typing your search above and press return to search.

పన్నుకు పన్ను.. ట్రెండింగ్ లో బాయ్ కాట్ అమెరికా..

అమెరికా వస్తువులకు వ్యతిరేకంగా బాయ్ కాట్ అమెరికా అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమం నడుస్తోంది. ఇది వారం రోజులుగా ’బాయ్ కాట్ అమెరికా’ హ్యాష్ ట్యాగ్ గూగుల్ లో ట్రెండింగ్ లో ఉంది.

By:  Tupaki Desk   |   14 March 2025 9:00 PM IST
పన్నుకు పన్ను.. ట్రెండింగ్ లో బాయ్ కాట్ అమెరికా..
X

ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం సుంకాలు.. చైనా ఉత్పత్తులపై విధించిన సుంకాలు రెట్టింపు.. కెనడా, మెక్సికో దిగుమతులపై 25శాతం సుంకాలు.. టారిఫ్ ల కొరడా పట్టుకుని తిరుగుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటివరకు అంతా బాగానే ఉన్నా.. మున్ముందు మాత్రం ట్రంప్ నకు తిప్పలు తప్పేలా లేవు.

తమపై సుంకాల ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే యూరోపియన్ (ఈయూ) అమెరికాపై 28 బిలియన్‌ డాలర్ల (26 బిలియన్‌ యూరోలు) సుంకాలను విధించింది. అయితే, దీనిపై ట్రంప్ ఏమాత్రం తగ్గలేదు. ఈయూ తమ దగ్గర వసూలు చేసినంతే తామూ వసూలు చేస్తామని ప్రకటించారు.

కెనడా, మెక్సికో, చైనా, యూరప్ దేశాలు.. ఇలా వేటినీ వదలకుండా ట్రంప్ సాగిస్తున్న టారిఫ్ వార్ చివరకు అమెరికాకే చేటు తెచ్చేలా ఉంది.

ట్రంప్ చర్య వాణిజ్య యుద్ధానికి కారణమైంది. ఈ రోజుల్లో ఏ దేశమూ తగ్గడం లేదు. దీంతో అమెరికాకు చిక్కొచ్చి పడేలా ఉంది. ఇప్పటికే ఆ దేశ స్టాక్ మార్కెట్లు వణుకుతున్నాయి. ఇది చాలదన్నట్లు అమెరికా వస్తువులను బాయ్ కాట్ చేయాలంటూ ఉద్యమం మొదలైంది.

అమెరికా వస్తువులకు వ్యతిరేకంగా బాయ్ కాట్ అమెరికా అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమం నడుస్తోంది. ఇది వారం రోజులుగా ’బాయ్ కాట్ అమెరికా’ హ్యాష్ ట్యాగ్ గూగుల్ లో ట్రెండింగ్ లో ఉంది.

ఫేస్ బుక్ పేజీలతో..

అమెరికా వస్తువుల బహిష్కరణ నినాదంతో కొన్ని దేశాలైతే ఫేస్ బుక్ పేజీలే నిర్వహిస్తుండడం గమనార్హం. డెన్మార్క్‌ కు చెందిన పాక్షిక స్వయం ప్రతిపత్తి ప్రాంతం గ్రీన్‌ ల్యాండ్‌ పై ట్రంప్ కన్నేయడం కూడా అమెరికాకు చేటు తెస్తోంది. డెన్మార్క్‌ కు చెందిన ఫేస్‌ బుక్‌ గ్రూపులో దాదాపు 73,000 మంది సభ్యులు ఉండగా లగ్జెంబర్గ్‌ తర్వాత అత్యధిక సెర్చ్‌లు ఈ పేజీకే ఉండడం గమనార్హం . గూగుల్‌ లో బాయ్‌ కాట్‌ అమెరికా కోసం అత్యధికంగా సెర్చ్ లు జరుగుతున్న దేశాలలో స్వీడన్‌ నాలుగో స్థానంలో ఉంది. ఇక అమెరికా వస్తువులకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు అత్యుత్తమ సాధనంగా ఫేస్‌ బుక్‌ పేజీ ఉపయోగపడుతోంది. బాయ్‌కాట్‌ అమెరికా: బై ఫ్రెంచ్‌ అండ్‌ యూరోపియన్‌ పేరిట ఫ్రాన్స్‌ నిర్వహిస్తున్న ఫేస్‌ బుక్‌ పేజీ 20 వేల మంది సభ్యులతో గూగుల్‌ సెర్చ్ లో 3వ స్థానంలో ఉంది. కెనడా ఇప్పుడు బాయ్‌ కాట్‌ అమెరికా ప్రచారంలో ముందుంది. గూగుల్‌ సెర్చెస్‌ లో 5వ స్థానంలో నిలిచింది.