Begin typing your search above and press return to search.

నెలలో 139 బ్యాంక్‌ శాఖలు మూత... యూఎస్ లో ఏమి జరుగుతుంది?

ఇక ఈ మూడింటిలోనూ ప్రధానంగా బ్రాంచ్‌ లను మూసేస్తున్న బ్యాంకుల్లో "బ్యాంక్ ఆఫ్ అమెరికా" ముందు వరుసలో నిలిచింది

By:  Tupaki Desk   |   8 Feb 2024 12:30 AM GMT
నెలలో 139 బ్యాంక్‌ శాఖలు మూత... యూఎస్ లో ఏమి జరుగుతుంది?
X

అగ్రరాజ్యం అమెరికాలో వరుసగా బ్యాంకులు మూతపడుతున్నాయి. అలా అని ఒకటో రెండో కాదు సుమా... వందల సంఖ్యలో బ్యాంక్ శాఖలు మూతపడుతుండటం ఆసక్తిగా మారింది. ఇలా రికార్డ్ స్థాయిలో మూత పడుతున్న బ్యాంకులు, బ్రాంచులు, వాటి సంఖ్య మొదలైన విషయాలు ఇప్పుడు చూద్దాం..! అయితే... వీటి మూసివేతకు గల కారణాలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది!

అవును... అమెరికాలో రికార్డ్‌ స్థాయిలో బ్యాంక్‌ శాఖలు మూత పడుతున్నాయి. ఇందులో భాగంగా... గత నెలలో ఒక్క వారంలోనే సుమారు 37 బ్యాంచ్‌ లను మూసివేయడానికి అక్కడి బ్యాంకులు అమెరికా బ్యాంకుల నియంత్రణ సంస్థను అనుమతి కోరాయి. ఇలా రికార్డ్ స్థాయిలో అతి తక్కువ కాలంలోనే భారీగా మూసివేతకు గురవుతున్న బ్యాంచ్‌ లలో ప్రధానంగా "బ్యాంక్ ఆఫ్ అమెరికా", "టీడీ బ్యాంక్", "కీ బ్యాంక్" శాఖలే ఉన్నాయి.

ఇక ఈ మూడింటిలోనూ ప్రధానంగా బ్రాంచ్‌ లను మూసేస్తున్న బ్యాంకుల్లో "బ్యాంక్ ఆఫ్ అమెరికా" ముందు వరుసలో నిలిచింది. ఈ బ్యాంక్ గత సంవత్సరం సుమారు 160 శాఖలను మూసేసిందని తెలుస్తుంది. ఇక ఈ ఏడాది మొదటి నెలలోనే సుమారు 30 బ్రాంచ్‌ లు మూసేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఉద్యోగాలు కోల్పోతున్నవారి సంఖ్యకు ఇప్పుడు ఈ బ్యాం క్ సిబ్బంది సంఖ్య కూడా తోడవుతుందని అంటున్నారు!

అమెరికా బ్యాంకుల నియంత్రణ సంస్థ "ఆఫీస్ ఆఫ్ ద కంప్ట్రోలర్‌ ఆఫ్‌ ద కరెన్సీ" (ఓసీసీ) నుంచి అందిన సమాచారం ఆధారంగా జనవరి 21 నుంచి 27వ తేదీ వరకు.. అంటే ఒక వారం వ్యవధిలోనే మూత పడిన బ్యాంక్‌ బ్రాంచ్‌ ల వివరాలను డైలీ మెయిల్‌ తన కథనంలో పేర్కొంది. ఇందులో భాగంగా... గత జనవరి నెలలో మొత్తం సుమారు 139 షెడ్యూల్డ్ బ్యాంక్ బ్రాంచ్‌ లు శాశ్వతంగా మూతపడ్డాయి.

అయితే... 2023లో నెలవారీ సగటు కంటే ఇది అధికంగా ఉండటం గమనార్హం. కాగా... అమెరికాలో ఏదైనా బ్యాంకు తమ బ్రాంచ్‌ ను మూసివేయాలనుకున్నా లేదా కొత్త బ్రాంచ్ ను ఏర్పాటు చేయాలనుకున్నా ఆఫీస్ ఆఫ్ ద కంప్ట్రోలర్‌ ఆఫ్‌ ద కరెన్సీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన సంగతి తెలిసిందే!