అమెరికాలో పిడుగుల అలజడి... వేల ఫ్లైట్స్ కి ఎఫెక్ట్!
ఈశ్యాన్య ప్రాంతంలో 1,320 విమాన సర్వీసులు రద్దు కాగా.. వాటిల్లో 350 న్యూజెర్సీలోని న్యూఆర్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయం లోనే ఉన్నాయని తెలుస్తుంది.
By: Charan Telugu | 17 July 2023 9:40 AM GMTఅమెరికా లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయం లో భారీ వర్షాల కు తోడు భయంకరమైన పిడుగులు కూడా పడుతున్నాయని అంటున్నారు. అవి కూడా వేళ విమానాల ను ప్రభావితం చేసే స్థాయి లో అని తెలుస్తుంది.
అవును... అమెరికా లో పిడుగులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా దేశం లోని ఈశ్యాన్య ప్రాంతం లో ఈ పరిస్థితి నెలకొన్నట్లు చెబుతున్నారు. ఈ పిడుగుల అలజడి కారణంగా దాదాపు 2,600 విమాన సర్వీసుల ను రద్దు చేయడంతోపాటు మరో 8,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అంటున్నారు.
దీంతో అమెరికా లో పిడుగులు సృష్టిస్తోన్న అలజడి ఏ స్థాయి లో ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సమాచారం ప్రకారం.. ఈశ్యాన్య ప్రాంతంలో 1,320 విమాన సర్వీసులు రద్దు కాగా.. వాటిల్లో 350 న్యూజెర్సీలోని న్యూఆర్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయం లోనే ఉన్నాయని తెలుస్తుంది.
ఇదే క్రమంలో... జే.ఎఫ్.కే విమానాశ్రయం లో 318 రద్దు కాగా.. 426 సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయట. అదేవిధంగా... లా గార్డియన్ లో 270 సర్వీసులు రద్దుకాగా.. 292 ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయని అంటున్నారు. దీంతోపాటు జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్ పోర్ట్, లా గార్డియన్ ఎయిర్ పోర్టుల్లో పలు సర్వీసులు రద్దు చేశారని సమాచారం.
అయితే విమానాల రద్దు, షెడ్యూల్ ల్లో మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ఆయా విమానయాన సంస్థలు ట్విట్టర్ ద్వారా ప్రయాణికుల కు తెలియజేస్తున్నాయని అంటున్నారు. ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు బయల్దేరే ముందు.. మరోసారి విమాన సమయాల ను, వాతావరణ పరిస్థితులను చెక్ చేసుకోవాలని సూచిస్తున్నాయట.
ఈ భారీవర్షాల కారణంగా... మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... న్యూయార్క్, న్యూజెర్సీ, కనెటికట్, పెన్సిల్వేనియా, మాస్సాచుసెట్స్, వెర్మాంట్ ప్రాంతాల్లో అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారని సమాచారం. ఇదే సమయంలో టోర్నడో వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయని అంటున్నారు.
ఈశాన్య ప్రాంతాల్లో పరిస్థితి అలా ఉంటే... మరోవైపు అమెరికా లోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో మాత్రం ఎండలు దంచి కొడుతున్నాయట. ఇందులో భాగంగా... ఈశాన్య ప్రాంతం లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడుతుంటే... దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో మాత్రం ఏకంగా 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని సమాచారం.