Begin typing your search above and press return to search.

ఆ 'డేగ'.. అమెరికా జాతీయ పక్షి.. 240 ఏళ్లకు గుర్తింపు.. ఇంత వెనుకబాటా?

అమెరికా అంటే అందరికీ కలల దేశం.. డాలర్ల రాజ్యం.. ప్రపంచంలోని అన్ని దేశాల యువత అమెరికా వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంటారు

By:  Tupaki Desk   |   7 Aug 2024 7:45 AM GMT
ఆ డేగ.. అమెరికా జాతీయ పక్షి.. 240 ఏళ్లకు గుర్తింపు.. ఇంత వెనుకబాటా?
X

అమెరికా అంటే అందరికీ కలల దేశం.. డాలర్ల రాజ్యం.. ప్రపంచంలోని అన్ని దేశాల యువత అమెరికా వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంటారు.. అయితే, అమెరికా అంటే అంతా బాగుంటుందని కాదు.. అక్కడా అనేక లోటుపాట్లుంటాయ్.. రాజకీయాలుంటాయ్.. కొన్ని కీలక విషయాలూ పెండింగ్ లో ఉంటాయ్.. దీనికి ఉదాహరణే ఈ సంగతి. ఇక విషయానికి వస్తే.. అమెరికా జాతీయ జెండా అంటే అందరికీ తెలిసిందే. 50 నక్షత్రాలతో కూడిన ఆ జెండా ఆ దేశంలోని ఒక్కో రాష్ట్రానికి ప్రతీక. ఇక అమెరికా జాతీయ పక్షి ఏదంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే.. దానికి ఇప్పటివరకు ఆమోద ముద్ర పడలేదు కాబట్టి.

రెండున్నర శతాబ్దాల తర్వాత...?

మీరు చదువుతున్నది నిజమే.. ఏకంగా 240 ఏళ్లు చూసిచూసి.. అమెరికా జాతీయ పక్షిని తేల్చారు. వాస్తవానికి వందేళ్లుగా అయినా ఈ గుర్తును వాడుతున్నారు. కానీ.. కావాల్సిన జాతీయ పక్షి హోదా మాత్రం లేదు. ఇక తాజాగా గుర్తించిన పక్షి పేరు ‘ది బాల్డ్‌ ఈగిల్‌’. భారతీయ భాషలో చెప్పాలంటే డేగ. 1782 నుంచి అమెరికా రాజముద్రలో దీని బొమ్మ ఉంది. మరోదానితో మార్చాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అమెరికా చిహ్నంగా గుర్తింపు పొందిన ఈ గద్ద.. కొన్ని ఫొటోల్లో రెండు రెక్కలు చాచి.. ఒక కాలితో ఆకులను, మరో కాలితో బాణాలను గట్టిగా పట్టుకుని ఉంటుంది. అయితే, ఇన్నాళ్లకు దీనిని అధికారిక పక్షిగా ఎంపిక చేసిన బిల్లుకు అమెరికా సెనెట్‌ లో మోక్షం లభించింది. మిన్నెసోటాకు చెందిన అధికార డెమోక్రటిక్‌ పార్టీ సెనెటర్‌ అమీ క్లోబౌచెర్‌ ప్రవేశ పెట్టిన బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 240 ఏళ్లుగా అమెరికా విలువలకు ప్రతీకగా ది బాల్డ్‌ ఈగిల్‌ నిలిచిందని.. అయినా అమెరికా అధికారిక పక్షి కాలేకపోయిందని సెనెటర్‌ సిథియా లూమిస్‌ వ్యాఖ్యానించారు. అమెరికా బలమైన స్వేచ్ఛకు చిహ్నంగా ఆ పక్షి స్థానాన్ని మరింత బలోపేతం చేసిందని పేర్కొన్నారు. లూమిస్‌ ఈ బిల్లును సహ ప్రాయోజకులుగా వ్యవహరించారు. సెనెట్‌ ఆమోదంతో త్వరలోనే ప్రతినిధుల సభ కూడా ఆమోదించి.. అధ్యక్షుడి సంతకంతో చట్టంగా రూపొందనుంది.

అలాస్కాలో కనిపిస్తూ..

ద బాల్డ్ ఈగిల్ అలస్కా, మిన్నెసోటాలో అధికం. అమెరికా ఓ దేశంగా ఏర్పడిన కొత్తల్లో బాల్డ్‌ ఈగిల్‌ నే గుర్తుగా ఎంచుకొన్నారు. అందులోనూ బాల్డ్ ఈగిల్ కు అమెరికా స్వస్థలం. అయితే, 1940ల్లో కానీ.. వీటిని వేటాడడం నిషేధించలేదు. అమెరికా పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోల్లో కూడా బాల్డ్ ఈగిల్ కనిపిస్తాయి.