Begin typing your search above and press return to search.

ఓసారి చచ్చిపోయాను జీవిత ఖైదు వర్తించదు.. ఖైదీ లాజిక్!

ఒక ఖైదీకి కోర్టులో జీవిత ఖైదు శిక్ష వేశారు. ప్రస్తుతం ఆ శిక్ష అనుభవిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   28 May 2024 3:58 AM GMT
ఓసారి చచ్చిపోయాను జీవిత ఖైదు వర్తించదు.. ఖైదీ లాజిక్!
X

ఒక ఖైదీకి కోర్టులో జీవిత ఖైదు శిక్ష వేశారు. ప్రస్తుతం ఆ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ సమయంలో అతడికి హార్ట్ అటాక్ వచ్చింది. ఆల్ మోస్ట్ చనిపోయాడనే అంతా భావించారంట. అయితే.. హుటా హుటిన ఆస్పత్రికి తరలించగా.. ఆ ఖైదీ బ్రతికాడు. దీంతో... కోర్టులో ఓ పిటిషన్ వేశాడు. తాను ఓ సారి చనిపోయాని కాబట్టి.. ఇక తన జీవిత ఖైదు శిక్ష ముగిసినట్లేఅని! దీంతో... ఈ విషయం ఆసక్తిగా మారింది.

అవును... అమెరికాకు చెందిన బెంజమిన్ ఓ హత్య కేసులో అయోవా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో 2018లో అతడి గుండె ఆగింది.. వెంటనే జైలు నుంచి ఆస్పత్రికి తరలించగా వైద్యులు బతికించారు. దీంతో... తాను టెక్నికల్ గా ఒక సారి చనిపోయాను.. అందువల్ల తన జీవిత ఖైదు శిక్ష ముగిసింది.. ఆ శిక్ష తనకు వర్తించదంటూ కోర్టును ఆశ్రయించాడు. తాజాగా ఈ కేసులో తీర్పు వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... బెంజమిన్ ష్రెయిబర్, 1990ల మధ్యలో ఒక వ్యక్తిని పికాక్స్ హ్యాండిల్‌ తో కొట్టి చంపాడనే నేరంపై కోర్టు అతనికి జీవిత ఖైదు శిక్ష వేసింది. ఈ క్రమంలోనే 2018లో అతను ఉన్నపలంగా స్పృహ కోల్పోయాడు. దీంతో... అయోవా స్టేట్ పెనిటెన్షియరీ సమీపంలోని ఆసుపత్రికి తరలించబడ్డాడు.

ఈ సమయంలోనే అతని గుండె కొద్దిసేపు ఆగిపోయిన తర్వాత.. వైద్యుల శ్రమతో తిరిగి బ్రతికాడు! ఆ సమయంలో వైద్యులు ఎపినెఫ్రిన్, అడ్రినలిన్ ఉపయోగించారు. అనంతరం కాస్త కుదురుకున్నాక... అతని సెప్సిస్‌ కు చికిత్స చేసారు! చికిత్స అనంతరం తిరిగి జైలుకు పంపారు.

ఈ సంఘటన తర్వాత, ఖైదీ తన జీవిత ఖైదు ముగిసిందని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్‌ ను కోరాడు. అయితే.. న్యాయమూర్తులు ఈ వారం అతని వాదనను తిరస్కరించారు. దిగువ కోర్టు అతని పిటిషన్‌ ను కొట్టివేయడం సరైనదేనని తీర్పు చెప్పారు! ఈ సందర్భంగా న్యాయముర్తి అమండా పోటర్ ఫీల్డ్ అసక్తికర వ్యాఖ్యలుచేశారు.

ఇందులో భాగంగా.. బెంజిమెన్ ఇంకా బ్రతికే ఉన్నాడు.. ఫలితంగా అతను జైలులోనే ఉండాలి.. చనిపోయిన తర్వాతే శిక్ష పూర్తవుతుంది అని పేర్కొన్నారు! ఇదే సమయంలో... నేరస్థులైన ముద్దాయిలను జైలు శిక్ష సమయంలో అనారోగ్యం పాలయ్యి వైద్యం చేసిన ప్రతీసారీ వారిని విడిపించాలని కోరుకునే అవకాశం లేదని అన్నారు.